
లేడీ దేవదాస్...!
ప్రేమలో విఫలమైన అబ్బాయిలను దేవదాస్‌తో పోల్చడం కామన్. కానీ, ఇప్పుడు ఓ అమ్మాయి దేవదాస్ అయితే ఎలా ఉంటుంది?
ప్రేమలో విఫలమైన అబ్బాయిలను దేవదాస్‌తో పోల్చడం కామన్. కానీ, ఇప్పుడు ఓ అమ్మాయి దేవదాస్ అయితే ఎలా ఉంటుంది? అనే కథతో డి. రామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ‘అమ్మాయి దేవదాస్ అయితే’. కార్తీక్, వృషాలి గోసావి జంటగా బి. శ్రీనివాస్ రెడ్డి, కె. కిశోర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘అక్కినేని నాగేశ్వరరావుగారి అద్భుతమైన నటనతో రూపొందిన ‘దేవదాస్’ ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. మా లేడీ దేవదాస్ కూడా అందర్నీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఇందులో మంచి పాత్ర చేశానని కార్తీక్ అన్నారు.