అమ్మాయి మాయ! | andamaina maya movie poster Released | Sakshi
Sakshi News home page

అమ్మాయి మాయ!

Published Thu, Apr 23 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

అమ్మాయి మాయ!

అమ్మాయి మాయ!

ఆ కుర్రాడిని ఓ అమ్మాయి  మాయ చేసింది. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుందనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘అందమైన మాయ’. కార్తీక్, భవశ్రీ జంటగా నాగరాజు కొట్టే నిర్మించిన ఈ చిత్రానికి మణీంద్రన్ దర్శకుడు.  ఈ సినిమా పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ‘మా’ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఈ చిత్రం విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో నోముల నర్శింహయ్య, చిన శ్రీశైలం యాదవ్, కొట్టే బాలయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement