స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కార్తీక్, కృష్ణసాయి విజేతలుగా నిలిచారు.
హైదరాబాద్: స్కూల్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి లాన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో కార్తీక్, కృష్ణసాయి విజేతలుగా నిలిచారు. సరూర్‌నగర్ స్టేడియంలో ఆదివారం జరిగిన అండర్-14 బాలుర ఫైనల్స్‌లో కార్తీక్ (సిటీ మోడల్ హైస్కూల్ ) 6-4తో కౌశిక్ కుమార్ (డీఏవీ పబ్లిక్ స్కూల్)పై గెలుపొందాడు. అండర్-17 బాలుర ఫైనల్లో కృష్ణసాయి (భవన్స్ సైనిక్‌పురి) 6-2 తో జయంత్
(సెయింట్ పీటర్స్, నాచారం)పై విజయం సాధించాడు.
అండర్-14 బాలుర సెమీఫైనల్స్ ఫలితాలు: కార్తీక్ (సిటీ మోడల్ హైస్కూల్) 5-1తో వర్షిత్ కుమార్ (సెయింట్ జాన్స్ హైస్కూల్)పై, కౌశిక్ కుమార్ (డీఏవీ పబ్లిక్ స్కూల్) 5-0తో శ్రీశరణ్ (డీఏవీ పబ్లిక్ స్కూల్)పై గెలుపొందారు.
అండర్ -17 బాలుర సెమీఫైనల్స్ ఫలితాలు: జయంత్ (సెయింట్ పీటర్స్ స్కూల్) 5-1తో హరి హశ్వంత్ (శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్)పై, కృష్ణసాయి (భవన్స్ స్కూల్) 5-0తో యువరాజ్ (శ్రీచైతన్య టెక్నో స్కూల్)పై విజయం సాధించారు.