Karthik Rao Named CEO of Nielsen అంతర్జాతీయ దిగ్గజాలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్‌కు సీఈవోగా కార్తీక్ రావు నియమితులయ్యారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. మరోవైపు 2018 నుంచి సీఈవోగా ఉన్న డేవిడ్ కెన్నీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదోన్నతి పొందారు.
ఇదీ చదవండి: బాలీవుడ్‌లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్
కార్తీక్ రావు సుదీర్ఘకాలంగా నీల్సన్‌లోని వివిధ విభాగాల్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తదితర హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. చెన్నైలనోని లయోలా యూనివర్సిటీలో డిగ్రీ (ఎకనామిక్స్) చదివిన కార్తీక్ రావు, అమెరికాలోని ఇలినాయిస్ స్టేట్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పొందారు. నీల్సన్ ప్రపంచవ్యాప్తంగా 55 కంటే ఎక్కువ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. (ఆగస్టులో రిజిస్ట్రేషన్లు‘ భూమ్’! టాప్-5 లిస్ట్ ఇదే!)
Comments
Please login to add a commentAdd a comment