జగపతిబాబు ప్రధాన పాత్రలో, కార్తీక్, అమ్ము అభిరామి జంటగా బాల నటి సహశ్రిత మరో కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్’. విద్యాసాగర్ రాజు దర్శకత్వం వహించారు. శ్రీ రంజిత్ మూవీస్ ప్రొడక్షన్స్‌పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాను జనవరిలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘కొంత విరామం తరువాత మళ్లీ వరుసగా సినిమాలు నిర్మించనున్నాను.
ఇప్పటికే నాలుగు కథలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయగా, వాటిలో ‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్’ ఒకటి. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. కథానుసారమే టైటిల్ నిర్ణయించాం. థియేటర్‌లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. మంచి చిత్రాలను కుటుంబ సమేతంగా థియేటర్‌లో చూసి ఆదరించే ప్రేక్షకుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మా చిత్రం రూపొందింది’ అన్నారు. ‘‘ఫాదర్–చిట్టి–ఉమ–కార్తీక్ అనే పాత్రల మధ్య జరిగే ఈ చిత్రకథలో భావోద్వేగాలు, వినోదం సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి’’ అన్నారు విద్యాసాగర్ రాజు. ఈ చిత్రానికి కెమెరా: శివ.జి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో.
Comments
Please login to add a commentAdd a comment