హీరో రవితేజ పేరు చెప్పగానే 'థర్ట్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ' అనే మాట గుర్తొస్తుంది. ఎందుకంటే 1990 నుంచి టాలీవుడ్‌లో ఉన్న ఇతడు.. సహాయ పాత్రలతో మొదలుపెట్టి స్టార్ హీరో రేంజుకు ఎదిగాడు. హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటాడు. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఓ విషయంలో మాత్రం వరస తప్పులు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇప్పుడీ విషయమై అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి, తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకున్న రవితేజ.. ఎంతోమంది కొత్త దర్శకుల్ని పరిచయం చేశాడు. అలానే చాలామంది యువ హీరోలకు రోల్ మోడల్ కూడా అయ్యాడు. అయితే హీరోగా చాలా పేరు సంపాదించిన రవితేజ.. కొన్నేళ్ల ముందు నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. కానీ ఇక్కడ మాత్రం వరస తప్పులు జరుగుతున్నాయి.
(ఇదీ చదవండి: ప్రేమ కావాలంటున్న మెగా డాటర్ నిహారిక.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్)
హీరోగా రవితేజ కెరీర్ ఎలా ఉందనేది పక్కనబెడితే.. నిర్మాతగా మాత్రం వరసగా డిసప్పాయింట్ చేస్తున్నాడు. తొలుత 'గట్టుకుస్తీ' (మట్టీకుస్తీ) అనే తమిళ-తెలుగు డబ్బింగ్ మూవీ తీశాడు కలిసిరాలేదు. ఆ తర్వాత తనే హీరోగా తీసిన 'రావణాసుర'కి నిర్మాణ భాగస్వామ్యం చేశాడు. సేమ్ రిజల్ట్. వీటి గురించి వదిలేస్తే గతేడాది 'చాంగురే బంగారు రాజా' నిర్మించాడు. ఫలితం పెద్దగా మారలేదు.
తాజాగా కమెడియన్ హర్ష చెముడుని హీరోగా పెట్టి 'సుందరం మాస్టారు' అనే మూవీ తీశాడు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ స్పందన రాలేదు. అయితే ఇన్ని సినిమాల అనుభవమున్న రవితేజ.. నిర్మాతగా ఎందుకో సరిగా కాన్సట్రేట్ చేయట్లేదా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయాలనే ఆలోచన బాగానే ఉన్నప్పటికీ.. దాన్ని ఆచరించడంలో మాత్రం పూర్తిగా తడబాటు కనిపిస్తోంది. మరి ఈ విషయంలో రవితేజ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూడాలి?
(ఇదీ చదవండి: ప్రభాస్ డూప్‌కి షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంతంటే?)
Comments
Please login to add a commentAdd a comment