
బీఎండబ్ల్యూ కారు బీభత్సం ఇద్దరికి స్వల్ప గాయాలు
హైదరాబాద్: మితిమీరిన వేగంతో వచ్చిన ఓ కారు మూలమలుపు వద్ద ఫుట్‌పాత్‌ను ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కారు యజమానితోపాటు మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. మాదాపూర్‌లో నివసించే మహేశ్ అనే రియల్ ఎస్టేట్‌వ్యాపారి‡ విందు ముగించుకొని బీఎండబ్ల్యూ కారులో హర్ష అనే యువతితో కలసి పంజగుట్ట వైపు వస్తున్నారు.
తెలంగాణ భవన్ వైపు నుంచి కేబీఆర్‌పార్కు వైపు వెళ్తుండగా క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలో యూ టర్న్ వద్ద అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడమే కాకుండా కారు ముందు భాగం ఫుట్‌పాత్‌పైకి ఎక్కింది. బెలూన్లు తెరుచుకోవడంతో మహేశ్, హర్ష స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కిందకు దిగిన మహేశ్ కారు నంబర్ ప్లేట్లను, కారులో ఉన్న మద్యం సీసాలను బ్యాగులో వేసుకొని కారును వదిలేసి పరారయ్యాడు. పోలీ సులు కొద్దిసేపటి తర్వాత ఘటనాస్థలానికి చేరుకొని ఆధా రాలు సేకరించారు. బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్‌లో పోలీ సులు సమాచారాన్ని సేకరించగా ఆ కారు నిషికేశ్ పేరిట ఉందని తేలింది. మహేశ్‌ను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు చేయగా మద్యంసేవించి ఉన్నాడని తేలింది. ఈ కేసులో మహేశ్, నిషితేశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు.