
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా నున్నకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజినీర్ హర్షారెడ్డి పూణెలో అదృష్యమైన ఘటన కలకలం రేపుతోంది. విజయవాడ రూరల్ మండలం నున్నగ్రామానికి చెందిన హర్షారెడ్డి 15 నెలల నుంచి కనిపించకుండాపోయారు. పూణెలోని వొడాఫోన్ కంపెనీలో హర్షారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు.15 నెలలుగా అతను ఉద్యోగానికి రాకపోయినా.. 10 నెలలు జీతాన్ని హర్షారెడ్డి ఖాతాలో వొడాఫోన్ కంపెనీ జమ చేసినట్టు తెలుస్తోంది.
కంపెనీ వాళ్లే తమ కొడుకుని ఏమైనా చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుకు వినతిపత్రం ఇచ్చారు. అటు మహారాష్ట్ర పోలీసులుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ను శ్రీహర్షారెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు.