జాతీయ జూనియర్ చెస్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక జాతీయ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారుడు హర్ష భరత్‌కోటి రజత పతకం సాధించాడు. మహారాష్ట్రలోని పుణేలో శుక్రవారం ముగిసిన ఈ పోటీల్లో హర్ష అండర్-19 ఓపెన్ విభాగంలో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హర్ష 8.5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు.
హర్ష మొత్తం ఏడు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడిపోయాడు. కేరళ కుర్రాడు సునీల్‌దత్ లైనా నారాయణన్ 9 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. తెలంగాణకే చెందిన ప్రణీత్ సూర్య (7.5 పాయింట్లు), సాయి అగ్ని జీవితేశ్ (6.5 పాయింట్లు), ఎం.చక్రవర్తి రెడ్డి (6 పాయింట్లు) వరుసగా 9వ, 31వ, 45వ ర్యాంక్‌ల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు ధూళిపాళ బాలచంద్ర ప్రసాద్ 7 పాయింట్లతో 23వ ర్యాంక్‌లో నిలిచాడు.
హర్షకు రజతం
Published Sat, Jul 19 2014 12:23 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement