చెస్ చాంప్స్ సాయికాంత్, కీర్తి
హైదరాబాద్: అండర్-17 హైదరాబాద్ జిల్లా చెస్ చాంపియన్‌షిప్‌లో సాయికాంత్, కీర్తి విజేతలుగా నిలిచారు. బాలుర కేటగిరీలో ఐదు రౌండ్లకు గాను మూడున్నర పాయింట్లు సాధించిన సాయికాంత్, షణ్ముఖ తేజ ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరుతో సాయికాంత్ విజేతగా, షణ్ముఖ తేజ రన్నరప్‌గా నిలిచారు.
బాలికల ఈవెంట్‌లో జి. కీర్తి ఐదు పాయింట్లతో అగ్రస్థానం పొందింది. శ్రీచందన (4) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ నలుగురు హైదరాబాద్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ జట్టు తెలంగాణ రాష్ట్ర అంతర్ జిల్లా చెస్ చాంపియన్‌షిప్‌లో తలపడుతుంది. మహబూబ్‌నగర్‌లో ఈ నెల 20, 21 తేదీల్లో ఈ పోటీలు జరుగుతాయని ఆర్బిటర్ ఫయాజ్ తెలిపారు.