హైదరాబాద్: ప్రియుడు అనుమానించడం అవమానంగా భావించి టీవీ నటి నాగఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండ్రోజులుగా సూర్యతేజ మొబైల్ స్విచ్చాఫ్ రావడంతో అతనికి తెలిసిన వారికి పోలీసులు ఫోన్‌చేసి విచారణకు హాజరుకమ్మని చెప్పారు. దీంతో అతడు శనివారం రాత్రి పంజాగుట్ట పోలీసుస్టేషన్‌కు వచ్చారు. సూర్యతేజను పూర్తిగా విచారించిన అనంతరం అనుమానమే ఝాన్సీ ఆత్మహత్యకు కారణమని పోలీసులు నిర్ధారించినట్లు సమాచారం. ఝాన్సీ ఫోన్ నంబర్‌ను సూర్యతేజ బ్లాక్‌లిస్టులో పెట్టడం, ఫోన్ చేసినా స్పందించకపోవడం, సూర్యతేజకు ఇంట్లో వేరే సంబంధాలు చూడటం కూడా ఝాన్సీ ఆత్మహత్యకు కారణాలుగా పోలీసులు పేర్కొంటున్నారు.
న్యాయనిపుణుల సలహా తీసుకుని అతనిపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మధు అనే అమ్మాయి ద్వారా ఝాన్సీ పరిచయం కాగా అది ప్రేమగా మారిందని పోలీసులు చెప్పారు. వేరే వ్యక్తులతో ఝాన్సీ ఎక్కువగా మాట్లాడుతుండేదని, ఇది ఇష్టం లేని సూర్యతేజ సీరియల్స్‌లో నటించడం ఆపేయాలని ఒత్తిడి తీసుకురాగా అప్పటికే అగ్రిమెంట్ చేసుకున్న సీరియల్స్‌లో నటించేందుకు ఝాన్సీ సిద్ధమైంది. దీంతో సూర్యతేజ ఆమెతో గొడవపడి ఆమె మొబైల్ నంబర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాడు. ఝాన్సీ ఆత్మహత్య చేసుకునే రెండు రోజులముందు కూడా సూర్యతేజకు ఫోన్ చేయగా దానికి అతడు స్పందించలేదు. వాట్సాప్ మెసేజ్‌లు పంపగా మొబైల్ నెట్ ఆఫ్ ఉండటంతో సూర్యతేజ వాటిని చూసుకోలేదు. నెట్ ఆన్ చేసుకునే లోపు ఝాన్సీ పంపిన మెసేజ్‌లను తనే డిలీట్ చేసేసిందని తెలిపారు.
అవన్నీ అవాస్తవాలు: సూర్యతేజ
నాగఝాన్సీ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని సూర్యతేజ పోలీసుల విచారణలో తెలిపాడు. రూ.10 లక్షలు విలువ చేసే బంగారం ఇచ్చారన్నదాంట్లో వాస్తవంలేదని, కొంత బంగారం ఇవ్వగా అది తనఖా పెడితే రూ. రెండున్నర లక్షలు వచ్చాయని, అందులో మరో రూ. రెండున్నర లక్షలు కలిపి వారు ఓ స్థలం కొనే సమయంలో ఐదు లక్షలు తానే ఇచ్చానని తెలిపారు. తన పుట్టినరోజుకు మాత్రం రూ.లక్ష పెట్టి యమహా ఆర్15 ద్విచక్రవాహనం ఇప్పించిందన్నాడు. మా ఇంట్లో తమ ప్రేమ విషయం తెలిసినప్పటికీ తన ఇంటికి వచ్చి వారం రోజులు ఉందన్నది వాస్తవం కాదన్నాడు. గొడవలు ఉన్నమాట వాస్తవమే కానీ ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదని సూర్య తెలిపినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment