26న తపాలాశాఖ మహా మేళా
Published Wed, Mar 15 2017 12:51 AM | Last Updated on Tue, Sep 18 2018 8:18 PM
- కర్నూలులో కార్యక్రమం
- పోస్టల్ సూపరింటెండెంట్ కేవీ సుబ్బారావు
కర్నూలు(ఓల్డ్‌సిటీ): ఈనెల 26వ తేదీన కర్నూలులో తపాలా శాఖ మహామేళాను ఏర్పాటు చేస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ కె.వి.సుబ్బారావు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయన మంగళవారం తన ఛాంబరులో ఏఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లతో సమావేశమయ్యారు. పీఎల్‌ఐ, ఆర్‌పీఎల్‌ఐ, సుకన్య సమృద్ధి యోజన, మైస్టాంప్స్ వంటి పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. మహామేళాలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి అన్ని పథకాల గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. మహామేళా వేదికగా సంబంధిత అధికారులు మార్కెటింగ్‌లో ప్రగతి సాధించాలని సూచించారు. మహామేళాను నగరంలోని ఏ ప్రదేశంలో ఏర్పాటు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదని చెప్పిన కేవీ సుబ్బారావు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీలు సి.హెచ్.శ్రీనివాస్, నాగానాయక్, ఇన్‌స్పెక్టర్లు నూరుల్లా, శ్రీనివాసరాజు, ఫజులుర్రహ్మాన్, విజయమోహన్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement