రేపు జాబ్‌మేళా | job mela tomorrow | Sakshi
Sakshi News home page

రేపు జాబ్‌మేళా

Aug 6 2016 10:59 PM | Updated on Sep 4 2017 8:09 AM

ప్రభుత్వ పాత ఐటీఐలో సోమవారం విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం అభ్యర్థులను ఎంపిక చేస్తామని జిల్లా ఉపాధి అధికారి (క్లరికల్‌) ఇ.వెంకటరత్నం తెలియజేశారు.

మర్రిపాలెం: ప్రభుత్వ పాత ఐటీఐలో సోమవారం విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం అభ్యర్థులను ఎంపిక చేస్తామని జిల్లా ఉపాధి అధికారి (క్లరికల్‌) ఇ.వెంకటరత్నం తెలియజేశారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ ఓంక్యాప్‌ నేతత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. దుబాయి, యూఏఈ దేశంలోని జజీరా ఎమిరెడ్స్‌ పవర్‌ కంపెనీలో పలు ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుందన్నారు. ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, అసిస్టెంట్‌ ఫిట్టర్‌ ఉద్యోగాలకు ఐటీఐలో శిక్షణ పూర్తిచేసి ఉండాలన్నారు. హెల్పర్‌ ఉద్యోగాలకు పదో తరగతి విద్యార్హత కలగినవారు అర్హులన్నారు. పై అన్ని ఉద్యోగాలకు రెండు నుంచి మూడేళ్ల అనుభవం కలిగివుండాలన్నారు. వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. లైట్‌ వెహికల్‌ డ్రైవర్, హెవీ డ్రైవర్‌ ఉద్యోగాలకు పదో తరగతితోపాటు యూఏఈ లైసెన్స్‌ తప్పక కలిగివుండాలని సూచించారు. మొత్తం ఖాళీలు 100 ఉన్నాయన్నారు. అభ్యర్థి పాస్‌పోర్టు కలిగిఉండాలని, ఉచిత వసతి, రవాణా సౌకర్యం సంస్థ ఏర్పాటు చేస్తుందన్నారు. ఆసక్తి గల పురుష అభ్యర్థులు పూర్తి వివరాలతో కూడిన బయోడేటా, పాస్‌పోర్టు, ఒరిజినల్‌ సర్టిఫికెట్, రెండు పాస్‌పోర్టు ఫొటోలతో ప్రభుత్వ పాత ఐటీఐ ఉదయం 10 గంటలకు నేరుగా హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8179204289, 7075340904 నెంబర్లను సంప్రదించవచ్చు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement