బీఎస్‌ఎన్‌ఎల్‌ మేళాకు విశేష స్పందన | good responce for bsnl mela | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ మేళాకు విశేష స్పందన

Published Sun, Sep 25 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

good responce for bsnl mela

– ఉచిత సిమ్‌ పథకానికి 27 వరకు గడువు పొడిగింపు
 
కర్నూలు(ఓల్డ్‌సిటీ): భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) నిర్వహించిన రెండు రోజుల ఉచిత సిమ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. జీఎం పి.ఎస్‌.జాన్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో  ఏర్పాటు చేసిన మేళా శిబిరాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులు రెండు రోజుల వ్యవధిలో రెండు వేలకు పైగా సిమ్‌లు తీసుకున్నారని చెప్పారు.   ప్రజల నుంచి ఆదరణ లభిస్తుండటంతో  ఉచిత సిమ్‌లు పొందేందుకు  మరో మూడురోజులు  గడువు పెంచినట్లు వెల్లడించారు. దరఖాస్తులు స్వీకరించడానికి 26, 27 తేదీల్లో వినియోగదారుల సేవా కేంద్రాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement