నేటి నుంచి ఉచిత సిమ్ మేళా
నేటి నుంచి ఉచిత సిమ్ మేళా
Published Thu, Sep 8 2016 7:12 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM
– రూ. 49కే ల్యాండ్‌లైన్ కనెక్షన్
– రూ. 249కే బ్రాడ్ బ్యాండ్
– బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం పి.ఎస్.జాన్
కర్నూలు(ఓల్డ్‌సిటీ): జిల్లాలోని 54 చోట్ల శుక్రవారం నుంచి రెండు రోజులపాటు ఉచిత సిమ్ మేళా నిర్వహించనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం పి.శామ్యూల్ జాన్ తెలిపారు. గురువారం తన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. రూ. 49కే ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఇస్తామని, మేళా శిబిరాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. ఒక రూపాయికి ఒక జీబీ చొప్పున రూ. 249కే 300 జీబీ బ్రాండ్ బ్యాండ్ ఇస్తున్నామని, ఇన్‌స్టులేషన్ చార్జీలు మాఫీ చేస్తామన్నారు. రోజూ రాత్రి 9 నుంచి ఉదయం 7 గంటల వరకు, ఆదివారం 24 గంటలూ ఏ నెట్‌వర్క్‌తోనైనా ఉచితంగా మాట్లాడవచ్చని తెలిపారు. నగరంలో ఎస్‌ఏపీ క్యాంప్, సీక్యాంప్, కలెక్టరేట్, జెడ్పీ కార్యాలయం, పున్నమి గెస్ట్‌హౌస్, పాతబస్టాండులోని టీఆర్‌ఏ కార్యాలయం వద్ద ఉచిత సిమ్ శిబిరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. డీజీఎంలు నరసింహులు, నాగరాజు, ఎస్‌డీఈ నాగరాజు పాల్గొన్నారు.
Advertisement
Advertisement