
మెక్‌డొనాల్డ్స్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన లోగోల్లో ఒకటి. ఎరుపు మీద పసుపుపచ్చ రంగులో అందరికీ తెలిసిందే. కానీ.. అరిజోనాలోని సెడోనాలో ఉన్న ఓబ్రాంచ్‌లో మాత్రం మెక్‌డొనాల్డ్స్ లోగో నీలిరంగులో ఉంటుంది. ప్రపంచమంతటా బంగారు వర్ణంతో మెరిసిపోతుంటే... అక్కడ మాత్రమే నీలి రంగులో ఎందుకుంది? ఎందుకో తెలుసా? సెడోనా... ఎర్రరాతి పర్వతాలు, సహజ అందాలతో అలరారే అద్భుతమైన నగరం.
అలాంటి నగర ప్రశాంతతకు అంతరాయం కలిగించే ఏ నిర్మాణాలను, కట్టడాలను స్థానిక అధికారులు అనుమతించరు. నగరంలో ఏం నిర్మించాలన్నా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మెక్‌డొనాల్డ్స్ 1993లో సెడోనాలో తన అవుట్‌లెట్‌ను ప్రారంభించాలనుకున్నప్పుడు కూడా స్థానిక అధికారులు దాని పసుపురంగు లోగోపై అభ్యంతరం చెప్పారు. దానికి బదులుగా ఆహ్లాదకరంగా ఉండే నీలిరంగును వాడాలని సూచించారు. టీంతో అధికారుల ఆదేశాల మేరకు మెక్‌డొనాల్డ్స్ అలాగే ఏర్పాటు చేసింది. ఇప్పుడు అదికూడా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఇక్కడికి వచ్చినవారెవరూ అరుదైన ఈ లోగోముందు ఫొటో తీసుకోకుండా వెళ్లరు.
Comments
Please login to add a commentAdd a comment