అమెరికాలో లోయలోకి పల్టీకొట్టిన కారు | america :car falls down in valley | Sakshi

అమెరికాలో లోయలోకి పల్టీకొట్టిన కారు

Dec 9 2013 2:23 AM | Updated on Apr 4 2019 3:25 PM

కొండ అంచున ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పింది... 250 అడుగుల లోయలోకి జారిపడింది... ఏడుసార్లు పల్టీలు కొట్టింది... ఈ ప్రమాదం తీరు చూస్తే అందులోనున్న ఏ ఒక్కరూ బతికి బయటపడే అవకాశమే లేదనిపిస్తుంది! కానీ అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో గత బుధవారం చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు సభ్యుల కుటుంబం ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడింది.

 మృత్యుంజయులు..!
 అమెరికాలో లోయలోకి పల్టీకొట్టిన కారు
 వాషింగ్టన్: కొండ అంచున ప్రయాణిస్తుండగా కారు అదుపు తప్పింది... 250 అడుగుల లోయలోకి జారిపడింది... ఏడుసార్లు పల్టీలు కొట్టింది... ఈ ప్రమాదం తీరు చూస్తే అందులోనున్న ఏ ఒక్కరూ బతికి బయటపడే అవకాశమే లేదనిపిస్తుంది! కానీ అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో గత బుధవారం చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు సభ్యుల కుటుంబం ప్రాణాపాయం నుంచి క్షేమంగా బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై సీబీఎస్ న్యూస్ కథనం ప్రచురించింది. ఆరిజోనా ఉత్తరప్రాంతంలోని టొనాలియాకు చెందిన కొలీన్ సావజె అనే మహిళ తన సోదరి, ఆమె ఇద్దరు పిల్లలతో కలసి కారులో ప్రయాణమయ్యారు.
 
  జాతీయ రహదారిపై మిన్‌గస్ పర్వత పాద ప్రాంతానికి చేరుకొనేసరికి హిమపాతం మొదలైంది. ఆ సమయంలో కేవలం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వారి కారు మంచుదిబ్బను ఢీకొని అదుపుతప్పింది. కొండ మలుపులో నుంచి250 అడుగుల లోయలోకి జారిపడింది. ఈ స మయంలో సావజె సమయస్ఫూర్తితో కారులోని వారిని అప్రమత్తం చేశారు. పల్టీ లు కొడుతున్న కారులోనుంచి ఎవ్వరూ బయటపడిపోకుండా కాపాడగలిగారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement