eye camp
-
ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్
అరిజోనా రాష్ట్రంలోని ఫీనిక్స్ నగరంలో నవంబర్ 3న జరిగిన శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ విజయవంతమైంది. ఈ ప్రాంతంలో మొదటి తెలుగు కాన్సర్ట్‌గా నిలిచిన ఈ ఈవెంట్ సుమారు 120,000 డాలర్ల విరాళాలను సమీకరించింది, ఇందులో ఆరు MESU దాతల విరాళాలు కూడా ఉన్నాయి.ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఎస్. బద్రినాథ్, రతన్ టాటా గారిని స్మరించుకొని, వారి సేవలను కొనియాడారు. శంకర నేత్రాలయ USA పయనాన్ని, సంస్థ స్థాపన నుండి నేటి ప్రస్తుత కార్యక్రమాలను వివరించారు. అలాగే వ్యవస్థాపక అధ్యక్షులు ఎమిరేటస్ ఎస్.వి. ఆచార్య , ప్రస్తుత అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో సంస్థ తన సేవలను విస్తరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర దృష్టి సంరక్షణను అందించే మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) కార్యక్రమం ద్వారా. చెన్నై, హైదరాబాద్, జార్ఖండ్ కేంద్రాలతో పాటు, పుట్టపర్తి , విశాఖపట్నం కేంద్రాల కోసం ప్రణాళికలను తెలియజేసింది.ఈ కార్యక్రమంలోమణి శర్మ సంగీత ప్రదర్శన, ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. కొంతమంది దాతలను సత్కరించారు. అలాగే మరో ఆరు MESU యూనిట్ల కోసం, తమిళనాడుకు నాలుగు , ఆంధ్రప్రదేశ్‌కు రెండు దాతలు ముందుకు వచ్చారు.కాన్సర్ట్ తర్వాత, చాండ్లర్‌లోని ఫిరంగీ రెస్టారెంట్లో ప్రత్యేక మీట్-అండ్-గ్రీట్ ఏర్పాటుచేశారు, అక్కడ మణి శర్మ గారి సంతకంతో ఉన్న ఫోటోలను వేలం వేశారు. అలాగే, గురువారం రాత్రి పియోరియాలో మణి శర్మ గారి మరియు వారి బృందానికి ప్రత్యేక సాయంకాలపు కార్యక్రమం నిర్వహించారు. ఈ రెండు వేలంపాటల ద్వారా మొత్తం $4,875 సేకరించాము, ఇది శంకర నేత్రాలయ MESU కార్యక్రమం ద్వారా 75 కాటరాక్ట్ శస్త్రచికిత్సలకు నిధులను అందించింది.ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన మూర్తి రేఖపల్లి, శ్యాం అప్పలికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వంశీ కృష్ణ ఇరువారం (జాయింట్ సెక్రటరీ),ఆది మొర్రెడ్డి,, రేఖ వెమాల , ధీరజ్ పోలా , శరవణన్, శ్రీధర్ చెమిడ్తి, సాకేత్, సీత గంట, గార్లు టెర్రీ కింగ్, సరిత గరుడ, రాజ్ బండి, శోభ వడ్డిరెడ్డి, లక్ష్మి బొగ్గరపు , రూప మిధే, మణు నాయర్, చెన్నా రెడ్డి మద్దూరి, కాశీ, మూర్తి వెంకటేశన్, మంజునాథ్, దేవా, జయప్రకాశ్, మహిత్ కృషిని అభినందించారు. శంకర నేత్రాలయ మిషన్‌కు అండగా ఉన్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది శంకర నేత్రాలయ.ఈ కార్యక్రమం పట్ల హాజరైన వారందరూ ప్రశంసలు వ్యక్తం చేయగా, ఫీనిక్స్ శాఖలో చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపారు. షైనింగ్ స్ప్రౌట్స్ మరియు లవింగ్ కైండ్‌నెస్ బృందాలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సంస్థ, శంకర నేత్రాలయ మిషన్‌ను ప్రోత్సహించడంపై ఉన్న నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడింది. -
అట్లాంటాలో ఘనంగా శంకర నేత్రాలయ “నవరసం” వేడుకలు
అట్లాంటాలో శంకర నేత్రాలయ “నవరసం” వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కర్ణాటిక్ స్ట్రింగ్స్ వయోలిన్ స్టూడియో వ్యవస్థాపకురాలు జస్సోత బాలసుబ్రహ్మణ్యం శంకర నేత్రాలయ USA (SNUSA) ప్రెసిడెంట్ బాలా రెడ్డి ఇందుర్తి, ట్రస్టీ నీలిమ గడ్డమణుగుల ఆధ్వర్యంలో 8 విభిన్న శాస్త్రీయ నృత్య అకాడమీలతో సమన్వయంతో నిధుల సమీకరణ చేయడానికి ఆసక్తిని వ్యక్తం చేశారు. వయోలిన్ అకాడమీతో సహా, 9 అకాడమీలు పేద రోగులకు దృష్టిని పునరుద్ధరించే ఉదాత్తమైన కారణం కోసం సెప్టెంబర్ 14, 2024న నవరసం పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాయి. హౌస్ ఫుల్ షో కావడంతో ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది. దీనికి శంకర నేత్రాలయకు, వారి మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. పాల్గొన్న అన్ని విద్యాసంస్థలు, గురువులు మరియు విద్యార్థుల సహాయాన్ని కృతజ్ఞతలు తెలిపారు.SNUSA బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ డా. రాజ్ మోడీ, ట్రస్టీ వంశీ కృష్ణ ఏరువరం సోషల్ మీడియాలో ఈవెంట్‌ను ప్రచారం చేయడంలో సహాయం చేసారు. SNUSA వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు ఎమెరిటస్ S.N. ఆచార్య, బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ ప్రసాద్ రెడ్డి, లీలా కృష్ణమూర్తి , కోశాధికారి బానోతు రామకృష్ణన్ అట్లాంటా టీమ్ గ్రాండ్ సక్సెస్‌పై అభినందనలు తెలిపారు. అగస్టా జిఎ ముఖ్య అతిథి టి.రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినప్పటికీ, ఆయన దత్తత తీసుకున్న నంది వడ్డెమాన్‌లో నవంబర్ 2024లో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. గౌరవ అతిథి డా. కల్పనా రెంగరాజన్ శంకర నేత్రాలయతో తనకున్న అనుబంధాన్ని, సంగీత నృత్య కచేరీ గురించి అద్భుతమైన అనుభవాన్ని పంచుకున్నారు ఈ ప్రతిపాదనను SNUSA బోర్డ్ ఆఫ్ అడ్వైజర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ జగదీష్ షేత్ సులభతరం చేశారు.అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమళ్లతో పాటు చాప్టర్ లీడ్స్ చిన్మయ్ దాస్మోహపాత్ర, హేమంత్ వర్మ పెన్మెత్స, సుధీర్ పాత్రో, విజయ్ గార్లపాటి ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించారు. వాలంటీర్లు దేవాన్ష్ తడికమళ్ల, గిరి కోటగిరి, గోపాల అభిమన్యు పుల్లెల, మౌర్య కొప్పిరెడ్డి, పరిచాయి కృష్ణ కత్తెర్ల, శివెన్ పాత్రో ఈ కార్యక్రమం గ్రాండ్‌గా విజయవంతం కావడానికి చాలా సహాయం అందించారు. SNUSA ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీని రెడ్డి వంగిమళ్ల, రాజశేఖర్ రెడ్డి ఐల, శ్రీధర్ రావు జూలపల్లి, నీలిమ గడ్డమణుగు, స్పోర్ట్స్ కమిటీ చైర్ రమేష్ బాబు చాపరాల, MESU UNIT (కమిటీ సభ్యుడు డాక్టర్ కిషోర్ రెడ్డి రసమల్లు నుండి సంపూర్ణ మద్దతు లభించింది.భారతదేశంలోని అంధులైన రోగులకు కంటిశుక్లం శస్త్రచికిత్సలకు మద్దతుగా మేము ఈ ఈవెంట్ నుండి గణనీయమైన నిధులను సేకరించాము. మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) అనేది చక్రాలపై ఉన్న ఆసుపత్రి మరియు చెన్నై, హైదరాబాద్ , జార్కండ్ నుండి 500 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఒక ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ప్రతి MESU (సంచాలక వైద్య శిబిరం) లో రెండు బస్సులు ఉంటాయి. ఈ బస్సులు మారుమూల గ్రామాలకు వెళ్లి క్షేత్రస్థాయిలోనే శస్త్రచికిత్సలు చేస్తుంటాయి. వీటిని ఐఐటీ మద్రాస్ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. బాలా రెడ్డి ఇందుర్తి , మూర్తి రేకపల్లి భారతదేశంలో ప్రస్తుతం MESU కార్యకలాపాలు ఎలా కొనసాగుతున్నాయి.ప్రస్తుతం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాలను కవర్ చేయడానికి చెన్నై, జార్ఖండ్, హైదరాబాద్ నుండి 3 MESU యూనిట్లు పూర్తిగా పనిచేస్తున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళలోని కొన్ని ప్రాంతాలలో సేవలను కవర్ చేయడానికి SNUSA మరియు బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ ఆనంద్ దాసరి మద్దతుతో 4వ యూనిట్ జనవరి 2025 ప్రారంభంలో పుట్టపర్తిలో ప్రారంభమవుతుంది. ఐదవ MESU యూనిట్ 2025 3వ త్రైమాసికంలో వైజాగ్‌లో SNUSA మరియు బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ ఉదయ భాస్కర్ గంటి మద్దతుతో కోస్తా ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు మరియు ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలను భువనేశ్వర్ వైపు కవర్ చేస్తుంది.అడాప్ట్-ఎ-విలేజ్ స్పాన్సర్లు శ్రీని రెడ్డి వంగిమల్ల, రాజశేఖర్ రెడ్డి ఐల, నీలిమ గడ్డమణుగు , బాల ఇందుర్తి ఈ MESU 10 రోజుల కంటి శిబిరాలు వందలాది మంది రోగులకు వారి స్వస్థలాలలో చూపును ఎలా పునరుద్ధరించాయో వివరించారు. అలాగే అట్లాంటా బృందం భారతదేశంలో వేల సంఖ్యలో కంటిశుక్లం శస్త్రచికిత్సలకు మద్దతుగా నిధులను సేకరించేందుకు నవంబర్ 17న సంవత్సరాంతపు కచేరీని నిర్వహించాలని యోచిస్తోంది. -
వరంగా జగనన్న ఆరోగ్య సురక్ష
-
తెలుగు సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని
భారత క్రికెట్ అభిమానులకు ఎంఎస్ ధోనిపై ఉన్న ఆదరణ తెలియనిది కాదు. తన ఆటలోని ప్రత్యేకత అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రజల అభిమానాన్ని సంపాదించిన ఆయనను కంపెనీలు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తూ మరింత లాభాలు సంపాదిస్తుంటాయి. అయితే తాజాగా హైదరాబాద్‌కు చెందిన మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ సీఈఓ సుధీర్ మాట్లాడుతూ ‘మాక్సివిజన్‌లో మొత్తం 40+ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది రోగులకు కంటి సంరక్షణ సేవలను అందిస్తున్నాం. మారుతున్న జీవనశైలిలో భాగంగా చాలా మంది గ్లుకోమా, రెటీనా సమస్యల వల్ల బాధపడుతున్నారు. కంటి చెకప్‌ల ద్వారా ఈ వ్యాధులను నివారించే అవకాశం ఉంటుంది. మ్యాక్సివిజన్ కంటి సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ఆన్లైన్, ఆఫ్‌లైన్, ఆన్-గ్రౌండ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఎంఎస్ ధోని వంటి ప్రముఖ వ్యక్తి ఇందులో భాగం అవ్వడం హర్షణీయం’అని అన్నారు. ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్ స్పష్టమైన దృష్టితో క్రీడలు, జీవితంలో విజయం సాధించవచ్చని మ్యాక్సివిజన్ ఐ హాస్పటల్స్ బ్రాండ్ అంబాసిడర్ ఎంఎస్ ధోని అన్నారు. తరచూ కంటి పరీక్షల చేసుకోవడంతో వాటిని సంరక్షించుకోవచ్చని తెలిపారు. ఈ రంగంలో మాక్సివిజన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. -
TANA: గుడివాడలో తానా చైతన్య స్రవంతి కార్యక్రమం
గుడివాడ (కృష్ణా జిల్లా): ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా గుడివాడలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక రోటరీ క్లబ్ సహాయంతో కళ్లు, ఈఎన్టీ, కేన్సర్ క్యాంప్ చేపట్టారు. స్కూల్ విద్యార్దినిలకు తానా చేయూత ద్వారా 55 మందికి స్కాలర్షిప్లు, తానా ఆదరణ ప్రోగ్రాం ద్వారా 25 కుట్టు మిషన్లు, 15 సైకిల్స్, 4 వీల్ చైర్స్ అందజేశారు. శశికాంత్ వల్లేపల్లి తన తండ్రి వల్లేపల్లి సీతా రామ్మోహన్ రావు పేరు మీద రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ - రోటరీ కమ్యూనిటీ సర్వీస్ ట్రస్ట్, గుడివాడ వారికి వైకుంఠ రథం బహూకరించారు. తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరి, టీఎన్ఐ లైవ్ ఎడిటర్ ముద్దు కృష్ణ నాయుడులను సత్కరించారు. తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ఈ సందర్భంగామాట్లాడుతూ.. డిసెంబర్ 2 నుంచి జనవరి 4 వరకు తానా చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో జరిగే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తానా టీమ్ స్క్వేర్ ద్వారా అమెరికాలోని తెలుగువారికి ఆపద, విపత్కర సమయాల్లో ఏ విధంగా సహాయం చేస్తున్నామో తానా సెక్రెటరీ సతీష్ వేమూరి వివరించారు. తానా చైతన్య స్రవంతి కార్యక్రమానికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా రావి వెంకటేశ్వర రావు, వర్ల కుమార్ రాజా, గుడివాడ రోటరీ క్లబ్ పాలక సభ్యులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వచ్చిన తానా నాయకులు శశికాంత్ వల్లేపల్లి, పురుషోత్తం గూడె, సునీల్ పాంత్రా, శశాంక్ యార్లగడ్డ, శ్రీమతి ఉమా కటికి, జోగేశ్వరరావు పెద్దిబోయిన, టాగోర్ మలినేని, రాజ కాసుకుర్తి, డాక్టర్ రావు మొవ్వా, శ్రీనివాస ఓరుగంటి, నాగ పంచుమర్తి కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. (క్లిక్: హైదరాబాద్‌లో తానా మహాసభల సన్నాహక సమావేశం జయప్రదం) -
నివారింపదగిన అంధత్వంపై అవగాహన అవసరం
భారత్‌లోని అనేక నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజల్లో ‘నివారించగలిగిన అంధత్వం’ గురించి అవగాహన పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నారు ‘ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్’ అనే స్వచ్ఛంద సంస్థ సీఈవో వినోద్ డేనియల్. ఇక్కడే చైన్నెలో పుట్టి ఐఐటీ ఢిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన ఈయన వృత్తిరీత్యా అంతర్జాతీయంగా ఎన్నో మ్యూజియంలలో పురాతన వారసత్వ సంపదను పరిరక్షించే పనిచేస్తుంటారు. అయితే భారత్‌లోని ప్రజల్లో చాలామంది కేవలం అవగాహన లేమితో చాలా తేలిగ్గా నివారించదగిన అంధత్వం బారిన పడి నాణ్యమైన జీవితం గడపలేని వారి కళ్లలో వెలుగులు నింపే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్న వినోద్ డేనియల్ హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పిన వివరాలివి... ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్తో కంటి సేవల వైపు ఎందుకు రావాల్సి వచ్చింది? వినోద్: గ్లోబల్ ఎస్టిమేట్స్ ఆఫ్ విజువల్ ఇంపెయిర్మెంట్ అధ్యయనాల ప్రకారం ప్రపంచంలోని అంధుల్లో 20.5% మంది భారత్‌లో ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలోనూ 88.2% మంది అంధత్వాన్ని తేలిగ్గా నివారించవచ్చు. మన దేశంలో 13.3 కోట్ల మందికి కేవలం కళ్లజోడు సమకూర్చడం లాంటి చిన్న చిన్న సహాయాలతోనే వారి అంధత్వాన్ని నివారించవచ్చుననీ, అలాగే 1.10 కోట్ల మంది పిల్లలదీ అదే పరిస్థితి అని ‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఐ కేర్ ఎడ్యుకేషన్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థ... ఢిల్లీ అప్టోమెట్రీ అండ్ బ్లైండ్నెస్ ప్రివెన్షన్ అనే కార్యక్రమంలో వెల్లడించిది. అయితే ఇంత తేలిగ్గా నివారింపదగ్గ అంధత్వాన్ని కూడా వారు దూరం చేసుకోలేకపోతున్నారు. కళ్లజోడు సమకూర్చడం లాంటి చిన్న కారణాలతో అంధత్వాన్ని నివారించగలిగితే మన ప్రజల్లోని ఉత్పాదకత 34% ఎక్కువవుతుంది. వాళ్ల ఆదారంలో కనీసం 20% పెరుగుదల ఉంటుంది. ఇలా పెద్దల్లోనే కాదు... మన దేశంలోని 8% నుంచి 10% మంది పిల్లలకు కళ్లజోళ్లు అవసరం. ఈశాన్యరాష్ట్రాల్లో అయితే కళ్లజోళ్ల ద్వారా కంటిచూపు మెరుగు చేయగల పిల్లల సంఖ్య దాదాపు 20% వరకు ఉంది. ఇంత చిన్న కారణాలతో వాళ్ల కంటిచూపు మెరుగ్గా లేని కారణంగా పెద్దలు ప్రమాదాలకు గురికావడం, పిల్లల్లో చదువు లేక నేరాల వైపునకు మళ్లడం, తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఆదాయం పెంచుకోలేక, జీవననాణ్యత లోపించిన బతుకులు గడుపుతున్నారు. ఇలాంటి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్ ప్రయత్నిస్తోంది. ఇండియా విజన్ ఇన్స్టిట్యూట్ సంస్థæ కార్యకలాపాలేమిటి? వినోద్: మా సంస్థ రెండు రకాలుగా పనిచేస్తోంది. మొదటిది తేలిగ్గా నివారింపదగిన అంధత్వాన్ని రూపుమాపేందుకు అవసరమైన కళ్లజోళ్లు లాంటి మౌలికమైన వస్తువులు అందిస్తోంది. సాధారణంగా పెద్ద ఎత్తున కొనుగోలు చేసినప్పుడు ఒక కళ్లజోడు ధర కేవలం రూ. 50లకే వచ్చేస్తుంటుంది. ఇక్కడ ప్రశ్న దాని ధర లేదా అదెంత ఖరీదైనది అని కాదు. దాదాపు మన ప్రజల్లో కేవలం కళ్లజోడు లాంటి చిన్న ఉపకరణంతోనే మన బతుకులో గణనీయమైన మార్పువస్తుందనే అవగాహనా తక్కువే. అందుకే ఒకవైపున మా సంస్థ ప్రజల్లో ఈ అవగాహన కల్పిస్తోంది. మరోవైపున కళ్లజోళ్లు అవసరమైన వారికి కావాల్సిన అద్దాల పవర్ ఎంతో తెలుసుకునే ఆప్టోమెట్రీషియన్ల సంఖ్య చాలా చాలా తక్కువ. ఉదాహరణకు మన దేశ అవసరాల కోసం 1,25,000 ఆప్టోమెట్రీషియన్లు కావాలి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఆప్టోమెట్రీషియన్ల సంఖ్య 40,000 మాత్రమే. మా సంస్థ ఒకవైపు ప్రజలకు అవసరమైన మౌలిక కంటి పరీక్షలైన స్క్రీనింగ్ నిర్వహించి కళ్లజోళ్ల వంటివి సరఫరా చేస్తుండటమే కాకుండా... అంతగా నైపుణ్యం లేని అప్టోమెట్రీషియన్ల, ఐ కేర్ రంగంలో ఉన్న వృత్తినిపుణుల (ఐ కేర్ ప్రొఫెషనల్స్) నైపుణ్యాలను మెరుగుపరచడం వంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇలా రెండంచెల్లో మా సంస్థ కృషి చేస్తూ ప్రజల్లో అంధత్వాన్ని నివారించడానికి కృషిచేస్తోంది. ఈ కార్యక్రమంలో మీకు ఎవరైనా సహాయపడుతున్నారా? వినోద్: బ్రియాన్ హాల్డెన్ అనే ఆస్ట్రేలియన్ ఇటీవలే చనిపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన బ్రియాన్ హాల్డెన్ విజన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ, హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ సంస్థలతో కలిసి (జాయింటి ఇనిషియేటివ్ ప్రాతిపదికన) మా సంస్థ పనిచేస్తోంది. అంతేగాక... చాలా కార్పొరేట్ సంస్థలు సేవాభావంతో మాకు సహకరిస్తున్నాయ. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంస్థ ఫౌండర్ చైర్మన్ అయిన డాక్టర్ జీ.ఎన్.రావు మా సంస్థ ట్రస్టీలలో ఒకరు. మన దేశంలో మీరు అందిస్తున్న సేవల గురించి సంక్షిప్తంగా... వినోద్: మన దేశంలో ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, గుజరాత్, ఒరిస్సా, అస్సాంలతోపాటు మిజోరాం, మేఘాలయా వంటి ఈశాన్య రాష్ట్రాల్లో కలుపుకొని దాదాపు 18 రాష్ట్రాల్లోని ప్రజలకు మా సంస్థ సేవలందిస్తోంది. అలాగే ఇక్కడి పలు రాష్ట్రాల్లో ప్రజలకు కళ్లజోడు పవర్ నిర్ధారణ చేయగల నిపుణుల సంఖ్య చాలా తక్కువ. అందుకోసం ఆ నిపుణుల వృత్తి నైపుణ్యాలను పెంచేలా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇక స్కూల్ పిల్లల విషయానికి వస్తే వారు మూడోతరగతిలో ఉన్నప్పుడు ఒకసారి; ఎనిమిది లేదా తొమ్మిదోతరగతిలో ఉన్న సమయంలో ఒకసారి కంటిపరీక్షలు నిర్వహిస్తే... ఆ సమయంలో ఏవైనా కంటిలోపాలు ఉన్నట్లు తెలుసుకుంటే అది చాలా మంచిదనీ, అది వారి మంచి భవిష్యత్తునకు సోపానమవుతుందనే భావన ఉంది. ప్రతి ఏటా ఈ మేరకు స్క్రీనింగ్స్ జరిగి, అవసరమైన వారికి సహాయం అందేలా మా సంస్థ కృషి చేస్తుంది. అలాగే అనేక రాష్ట్రాల్లోని బీడీ కార్మికులు, బాణాసంచా తయారుచేసే రంగాల్లోని కార్మికులు, (జిప్సీ వంటి) సంచార జాతుల్లోని అణగారిన వర్గాల ప్రజలకు అవసరమైన కళ్లజోళ్లు సరఫరా చేస్తోంది. ఇప్పటివరకూ ఏడాదికి 1,50,000 మందికి మా సంస్థ ద్వారా సహాయం అందుతోంది. మా ద్వారా సహాయమందే వారిలో పెద్దలూ, పిల్లలూ 65 : 35 నిష్పత్తిలో ఉంటున్నారు. ప్రస్తుతానికి 1.50 లక్షలమందికి సహాయం అందుతున్నా... మేం మెరుగుపరచుకుంటున్న కార్యకలాపాల వల్ల ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మేం పనిచేసే ప్రతిచోటా స్థానికంగా అక్కడ పనిచేస్తున్న ఐ–కేర్ ప్రొఫెషనల్స్‌తో కలిసి అక్కడి స్థానికులకు మా సేవలందేలా కార్యకలాపాలు చేపడుతున్నాం. మీరు చేపడుతున్న వినూత్న కార్యకలాపాల గురించి... వినోద్: అవును... కొన్ని వినూత్న కార్యకాలాపాలు సైతం నిర్వహిస్తున్నాం. నివారించదగిన అంధత్వాలను రూపుమాపడానికి ప్రజల్లో అవగాహన పెంచేందుకు మా సంస్థ కొన్ని వినూత్న కార్యక్రమల్ని చేపడుతోంది. హైదరాబాద సహా బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ముంబై వంటి నగరల్లో ‘‘వాక్ విత్ ద డార్క్’’ పేరిట ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాక్ విత్ ద డార్క్‌లో పూర్తిగా అంధులైన వారు కొంతమంది సెలిబ్రిటీలతో కలిసి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో సెలిబ్రిటీల కళ్లకు పట్టీలు కడతారు. అంధులు ఆ సెలిబ్రిటీల చేతి తమ చేతిలోకి తీసుకొని, వారి కార్యకలాపాల కోసం వారికి అన్ని విధాలా సహాయపడతారు. ఈ కార్యక్రమం ద్వారా అంధత్వం ఎంత దుర్భరంగా ఉంటుందనేది లోకానికి తెలియజెప్పడంతో పాటు, తగినంత చేయూత లభిస్తే అంధులు సైతం మిగతావారిలాగే ఎన్నో కార్యకలాపాలు చేయగలరనే సందేశం వెళ్తోంది. అలాగే నివారింపదగిన అంధత్వాన్ని తేలిగా రూపమాపడం మంచిదన్న సందేశమూ ఇస్తాం. ఇది అన్ని వర్గాల వారికీ చేరువై నివారింపదగిన అంధత్వంపై అవగాహన పెరగడం కోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. గత కొన్ని నెలల కిందట హైదరాబాద్‌లోని నెక్లెస్రోడ్డులోనూ ఈ తరహా కార్యక్రమాన్ని మేం చేపట్టాం. చాలా చోట్ల చేపడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో చాలామంది ప్రజలు తేలిగ్గా నివారించదగ్గ అంధత్వానికి దూరమై, వారి జీవననాణ్యత పెరిగితే ప్రభుత్వాల మీద కూడా చాలా భారాలు తొలగిపోతాయి. -
‘తెలంగాణ కంటి వెలుగు’లు
సాక్షి, హైదరాబాద్ : కంటి చూపు సమస్యలు లేని తెలంగాణే లక్ష్యంగా సరికొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వైద్యం అందించేందుకుగాను ‘తెలంగాణ కంటి వెలుగు’కార్యక్రమం చేపడుతోంది. కార్యక్రమం అమలుకు సంబంధించిన ప్రతిపాదనలను మంగళవారం ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ పంపింది. కళ్లద్దాల కొనుగోలు, పరీక్షలు చేసేందుకు పరికరాలు, తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ, పరీక్ష కేంద్రాల కోసం రూ.100 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే కార్యక్రమం మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ మూడో వారంలోనే కార్యక్రమం ప్రారంభించాలనుకున్నా ‘రైతు బంధు’చెక్కుల పంపిణీ నేపథ్యంలో మే మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. 3.5 కోట్ల మంది కోసం ఏర్పాట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో 15 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తారు. పాఠశాల వయస్సు వారికి ఆర్బీఎస్కే కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తుండటంతో వారు మినహా రాష్ట్రంలోని 3.5 కోట్ల మందికి పరీక్షల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా గ్రామాల వారీ షె డ్యూల్‌ను వైద్య, ఆరోగ్య శాఖ ఖరారు చేస్తోంది. రోగులకు ఇచ్చే మందులు, దృష్టి లోపాలున్న వారి కోసం 40 లక్షల కళ్లద్దాలు కొనుగోలు చేస్తోంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ కళ్లద్దాల కొనుగోలు ప్రక్రియ చేపట్టింది. దేశంలో భారీ సంఖ్యలో కళ్లద్దాలు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ఫ్రాన్స్, చైనా వంటి దేశాల్లోనే ఉత్పత్తి ఎక్కువగా ఉంది. టెండర్లలో ఎంపికయ్యే కంపెనీలు తక్కువ సమయంలో కళ్లద్దాలు సరఫరా చేసేలా నిబంధనలు రూపొందించారు. బాధ్యతల పంపిణీ కంటి పరీక్షల నిర్వహణ పూర్తిగా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చూసుకుంటారు. అవసరమైన వారికి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తారు. రోగుల వివరాల నమోదు సహా అవసరమైన ఏర్పాట్లు సమకూర్చుతారు. వివరాల నమోదులో మెడికల్ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణుడికి ఏఎన్ఎం (ఎంపీహెచ్ఏ) సహాయం చేస్తారు. రక్త, మూత్ర పరీక్షలకు నమూనాలు సేకరిస్తారు. ఫార్మసిస్టు పరీక్షల నివేదికల ఆధారంగా మందులు, కళ్లద్దాలను వైద్య నిపుణులు రోగులకు ఇస్తారు. కంటి పరీక్షల శిబిరానికి గ్రామ ప్రజలను తీసుకొచ్చేలా ఆశా కార్యకర్తలు పని చేస్తారు. స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలో.. కంటి పరీక్షల నిర్వహణకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, నేత్ర వైద్య నిపుణుడు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆశా కార్యకర్తలతో బృందాలు ఏర్పాటు చేస్తోంది. నేత్ర వైద్య నిపుణులు, జిల్లా వైద్యాధికారుల ఆధ్వర్యంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ కార్యక్రమ లక్ష్యాలు, ఉద్దేశాలు వివరిస్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో స్కూళ్లు, కమ్యూనిటీ భవనాల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే స్థానిక పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు ఎక్కడ నిర్వహించాలో మండల స్థాయి అధికారులు నిర్ణయించనున్నారు. 43 శాతం శుక్లాల వల్లే.. మారుతున్న జీవన శైలి, పౌష్టికాహారలోపాలే దృష్టి లోపాలకు ప్రధాన కారణమవుతున్నాయి. దశాబ్దం క్రితంతో పోల్చితే కంటి చూపు సమస్యలున్న రోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని 25 శాతం మంది కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పెద్ద వయస్సు వారికి శుక్లాలు (పొర), చిన్న పిల్లల్లో పోషకాహార లోపం వల్ల దృష్టి లోపం ఏర్పడుతున్నాయి. కంటి చూపు కోల్పోయిన వారిలో 43 శాతం మంది శుక్లాల వల్లే చూపు కోల్పోయారని నిర్ధారించారు. రాష్ట్రంలోని 7 శాతం జనాభా మధుమేహం కారణంగా కంటిచూపు సమస్య (డయాబెటిక్ రెటీనోపతి)తో బాధపడుతున్నారు. వీటితోపాటు మరో 7 శాతం మంది నీటి కాసులు (గ్లకోమా)తో బాధపడుతున్నారు. 40 ఏళ్లు దాటిన వారిలో గ్లకోమా లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కంటి సమస్యలతో బాధపడుతున్నవారు శుక్లాలు 43 శాతం నీటి కాసులు 7 శాతం డయాబెటిక్ రెటీనోపతి 7 శాతం బాల్యంలో అంధత్వం 4 శాతం నెలలు నిండని శిశువులకు సమస్యలు 4 శాతం చూపు మందగించడం 3 శాతం -
త్వరలో ప్రతి గ్రామంలో నేత్ర శిబిరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేత్ర శిబిరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయిం చారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలం దరికీ కళ్ల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయాల న్నారు. అనేక కారణాల వల్ల గ్రామీణ ప్రజ ల్లో కళ్లకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో మం త్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వ హించనున్న ఈ నేత్ర శిబిరాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. -
26న కంటి వైద్యశిబిరం
గద్వాల న్యూటౌన్: పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆప్తాలమిక్ శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామిరెడ్డి కంటి ఆస్పత్రి వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న శిబిరాన్ని కంటి సమస్యలతో బాధపడే వారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటిలో శుక్లాలు ఉన్న వారిని గుర్తించి, ఉచితంగా ఆపరేషన్లు చేస్తామని, శిబిరానికి వచ్చే వారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ జిరాక్స్ పత్రాలను తీసుకురావాలని ఆయన సూచించారు. -
130 మందికి కంటి పరీక్షలు
గోపాల్పేట: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ఉదయం జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 130 మందికి కంటి పరీక్షలు చేసినట్లు డాక్టర్ ఇస్మాయిల్ తెలిపారు. 23 మందికి కంటి పొరలు ఉన్నట్లు గుర్తించినట్లు ఆప్తాలమిక్ ఆఫీసర్ యుగేంధర్‌ప్రసాద్ తెలిపారు. వీరికి జిల్లా కంటి ఆసుపత్రిలో ఆపరేషన్లు చేయిస్తున్నట్లు చెప్పారు. శిబిరంలో హెల్త్ సూపర్వైజర్ నిరంజన్, స్టాఫ్‌నర్సు శిలివియా, ఫార్మాసిస్టు కవిత, ఏఎన్ఎం పద్మ, జయసుధ, ల్యాబ్ టెక్నిషీయర్ లక్ష్మీకాంత్‌రెడ్డి, గ్రేసీ నర్సింగ్ స్కూల్ ట్రైనీ ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులు, పెన్షనర్లకు కంటివైద్య శిబిరం
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, వాళ్ల కుటుంబ సభ్యుల కోసం ప్రతి నెలా ఒకటి, మూడో గురువారాల్లో నల్లగొండలోని జిల్లా పరిషత్ వెనక గల పెన్షనర్ల సామాజిక సేవా సదన్ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు జి.దామోదరరెడ్డి, కార్యదర్శి ఎం.ఎ. అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. గౌతమి నేత్రాలయం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరంలో ప్రాథమిక కంటి చూపు పరీక్ష, కళ్లజోడు పరీక్ష, కంటి ఒత్తిడి, నరాల పరీక్షలు నిర్వహిస్తారు. కంటిలో శుక్లం, రెటీనా, గ్లకోమా లాంటి శస్త్ర చికిత్సలు అవసరమైతే రాజమండ్రిలోని ఆస్పత్రిలో చేస్తారు. ఈ పరీక్షలన్నింటినీ హెల్తు కార్డులు గల రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, వాళ్ల కుటుంబ సభ్యులకు రుసుము లేకుండా అందజేస్తారు. ప్రాథమిక పరీక్షల అనంతరం, ఆపరేషన్ కు సిద్ధపడినవారికి ఏసీ బస్సులో ప్రయాణ సౌకర్యం, వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులు, వాళ్ల కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవాలని దామోదర్ రెడ్డి, అజీజ్ కోరారు. శిబిరానికి సంబంధించిన ఇతర వివరాలకు 9100447444/ 9100448444 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
వైద్య నిర్లక్ష్యంతో 60 మందికి అంధత్వం
గురుదాస్‌పూర్/న్యూఢిల్లీ: పంజాబ్‌లో కంటి వైద్యుడి నిర్లక్ష్యానికి 60 మంది అంధులయ్యారు. నాసిరకం పరికరాలు, అపరిశుభ్ర వాతావరణంలో ఆపరేషన్లు నిర్వహించడంతో శాశ్వతంగా చూపు కోల్పోయారు. గురుదాస్‌పూర్ జిల్లా గుమన్ గ్రామంలో కొన్ని రోజుల కిందట ఓ ఎన్జీవో వైద్య శిబిరంలో ఏర్పాటు చేసి 130 మందికి శస్త్ర చికిత్సలు చేసింది. వీరిలో 60 మంది చూపు కోల్పోయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన పంజాబ్ ప్రభుత్వం ఆపరేషన్లు నిర్వహించిన డాక్టర వివేక్ అరోరాను అరెస్టు చేయడంతోపాటు ఓ ప్రైవేటు ఆస్పత్రి, సంబంధిత ఎన్జీవోపై కేసులు నమోదు చేసింది. -
ఐ క్యాంప్ నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి