
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేత్ర శిబిరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయిం చారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలం దరికీ కళ్ల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయాల న్నారు. అనేక కారణాల వల్ల గ్రామీణ ప్రజ ల్లో కళ్లకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
శనివారం ప్రగతిభవన్‌లో మం త్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వ హించనున్న ఈ నేత్ర శిబిరాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment