Every village
-
ప్రతి పల్లెలోనూ రాయల్ ఎన్ఫీల్డ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాయల్ ఎన్ఫీల్డ్.. పేరుకు తగ్గట్టే హుందా ఉట్టిపడే ఈ మిడ్ సెగ్మెంట్ బైక్స్‌కు ఇప్పుడు దేశంలో ప్రతీ పల్లెలోనూ కస్టమర్ ఉన్నారు. భారత్‌లో ఏటా కంపెనీ సుమారు 6,00,000 వాహనాలను విక్రయిస్తోంది. ఇందులో 60 శాతం యూనిట్లు ప్రధాన నగరాల్లో అమ్ముడవుతుండగా మిగిలిన 40 శాతం చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల్లోని వినియోగదార్లకు చేరుతున్నాయని రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా, సార్క్ బిజినెస్ హెడ్ వి.జయప్రదీప్ తెలిపారు. 75 శాతం విక్రయ కేంద్రాలు మెట్రోయేతర ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. సంస్థ మొత్తం అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 10 శాతం ఉందని వివరించారు. హైదరాబాద్ మార్కెట్లో హంటర్ 350 బైక్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో ఆయన మాట్లాడారు. స్టూడియో ఫార్మాట్లో.. సంస్థకు దేశంలో 2,150 విక్రయశాలలు ఉన్నాయని జయప్రదీప్ వెల్లడించారు. ‘ఇందులో పట్టణాలు, గ్రామీణ ప్రాంత వినియోగదార్లను దృష్టిలో పెట్టుకుని స్టూడియో ఫార్మాట్లో సగం స్టోర్లను తెరిచాం. 600 చదరపు అడుగుల లోపు విస్తీర్ణంలో ఇవి ఉంటాయి. మూడేళ్లలోనే స్టూడియోల సంఖ్య 1,075కు చేరుకుందంటే మెట్రోయేతర ప్రాంతాల్లో బ్రాండ్‌కు ఉన్న ఇమేజ్ అర్థం చేసుకోవచ్చు. అమ్మకాల వృద్ధి 50 శాతం ఉంటే, గ్రామీణ ప్రాంతంలో ఇది ఏకంగా 60 శాతం ఉంది. ఎనిమిది మోడళ్లలో నాలుగు 350 సీసీ సామర్థ్యం గలవి. విక్రయాల్లో 350 సీసీ మోడళ్ల వాటా అత్యధికంగా 80 శాతం ఉంది. 250–750 సీసీ మిడ్ సెగ్మెంట్లో దేశంలో అన్ని కంపెనీలవి కలిపి నెలకు 60,000 బైక్స్ అమ్ముడవుతున్నాయి. ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్కు 85 శాతం వాటా ఉంది’ అని ఆయన వివరించారు. నెలకు రూ.4,999లతో.. హంటర్‌ను 349 సీసీ ఎయిర్ ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ జె-సిరీస్ ఇంజన్‌తో రూపొందించారు. 5 స్పీడ్ గేర్ బాక్స్, డిస్క్ బ్రేక్స్, డ్యూయల్ చానెల్ ఏబీఎస్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, ప్రీమియం డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుపరిచారు. బరువు 181 కిలోలు. వేరియంట్‌నుబట్టి హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో ధర రూ.1,49,900 నుంచి ప్రారంభం. 8రంగుల్లో లభిస్తుంది. నెల వాయిదా రూ.4,999లతో హంటర్‌ను సొంతం చేసుకోవచ్చు. వాయిదా పద్ధతిలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్‌ను కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య 55% ఉంది. -
త్వరలో ప్రతి గ్రామంలో నేత్ర శిబిరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేత్ర శిబిరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయిం చారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలం దరికీ కళ్ల పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయాల న్నారు. అనేక కారణాల వల్ల గ్రామీణ ప్రజ ల్లో కళ్లకు సంబంధించిన సమస్య తీవ్రంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో మం త్రులు, ఎంపీలు, ఉన్నతాధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వ హించనున్న ఈ నేత్ర శిబిరాలను ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పర్యవేక్షించాలని సూచించారు. -
ఊరూరా కన్నీరే!
అడుగంటిన భూగర్భజలాలు ఎండిపోతున్న తాగునీటి పథకాల బోర్లు డేంజర్ జోన్‌కు చేరిన 24 మండలాలు ఈ నెలలో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే ఊరట తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో పడిపోవడంతో తాగునీటి కష్టాలు పెరిగిపోయాయి. వేసవిలో గుక్కెడు నీటి కోసం గ్రామీణ జనం అవస్థలు పడుతోంది. కొళాయిల్లో వచ్చే అరకొర నీరు, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే చాలీచాలని నీటి కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. అయినా సరిపడునన్ని నీరు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. - అనంతపురం సిటీ జిల్లాలో ఎండిపోతున్న బోరుబావుల సంఖ్య ఆందోళనకు గురి చేస్తోంది. రెండు నెలల కిందట తాగునీటి పథకాలకు సంబంధించి 1800 బోరుబావుల్లో నీరు ఇంకిపోతే.. నేడు ఆ సంఖ్య 2500కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారుల నివేదికలు పేర్కొంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 3,314 గ్రామాలు ఉన్నాయి. ఇందులో 1980 గ్రామాలకు వివిధ పథకాలు, నదుల నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిగతా 1334 గ్రామాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. చాలా గ్రామ పంచాయతీల్లో తాగునీటి పైప్లైన్లు, చేతింపులు మరమ్మతులకు నోచుకోలేదు. ఆర్డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ అధికారులు వీటి గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని మండిపడుతున్నారు. జూన్‌లోనైనా వర్షాలు బాగా కురిస్తే భూగర్భజలాలు పెంపొంది.. నీటి ఎద్దడి నుంచి ఊరట పొందే అవకాశం ఉంటుంది. డేంజర్ జోన్లో 24 మండలాలు జిల్లాలోని 63 మండలాల్లో 11 మండలాలు సురక్షితం, 14 మండలాలు క్లిష్ట పరిస్థితుల్లో, మరో 14 మండలాలు అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఎక్కువగా నీటిని తోడేసిన 24 మండలాలు డేంజర్ జోన్ జాబితాలో నిలిచాయి. 271 గ్రామాల్లో ప్రభుత్వం వాల్టా చట్టాన్ని అమలు చేసింది. ఈ ప్రాంతాల్లో ఎక్కడా బోరు బావులు వేయకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ జాబితాలో గాండ్ల పెంట మండలంలోని పలు గ్రామాలు ప్రమాదకర స్థితిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 75.592 మీటర్ల లోతుకు బోరు వేసినా నీటి చుక్క కానరావడం లేదని చెబుతున్నారు. భయం భయంగా నీటి వినియోగం.. మునుపెన్నడూ ఇటువంటి నీటి ఎద్దడి చూడలేదు. మూడు వేల జనాభా ఉన్న కలుగోడులో కొళాయిలకు సరిపడునన్ని నీరు రావడం లేదు. ట్యాంకర్‌తో నీటిని సరఫరా చేస్తున్నా అందరికీ చాలడం లేదు. దరించి స్నానం చేయాలన్నా ధైర్యం చాలడం లేదు. బిందెడు నీటిని ఎలా సంపాదించాలో తెలియక భయం భయంగా నీటిని వాడుకుంటున్నాం. బోరుబావుల్లో నీటిమట్టం దారుణంగా పడిపోతోంది. దాహర్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. – సూరయ్య, కలుగోడు, గుమ్మఘట్ట మండలం -
ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం
-
ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం: కేటీఆర్
హైదరాబాద్: ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం హెచ్ఐసీసీలో జరిగిన ఐకాన్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ తెలంగాణలో 25 వేల గ్రామాలకు 2ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందిస్తామన్నారు. సైబర్ సెక్యురిటీ పాలసీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణనే అని కేటీఆర్ చెప్పారు. సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశానికే రోల్‌మోడల్ అని అన్నారు. సైబర్ దాడులకు సంబంధించి ఐకాన్ పాలసీ రూపొందించాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా 19 వేల స్టార్టప్స్ ఉన్నాయని తెలిపారు. స్థానిక భాషల్లో డొమైన్ నేమ్స్‌పై ఐకాన్ దృష్టి పెట్టాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు. -
ప్రతీ గ్రామాన్ని సందర్శించాలి
డీఎంహెచ్ఓ కొండల్రావు ఖమ్మం వైద్య విభాగం : ప్రతీ గ్రామాన్ని సందర్శించి వైద్య సేవలు అందించి సీజనల్ వ్యాధులు రాకుండా నిర్మూలించాలని డీఎంహెచ్ఓ ఏ. కొండల్రావు సిబ్బందిని ఆదేశించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో బుధవారం సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సూపర్వైజర్స్, సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రతీ పీహెచ్సీ పరిధిలో పనిచేస్తున్న సూపర్వైజర్స్, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్స్, ఆశ వర్కర్లతో టీమ్‌గా ఏర్పడి, ఒక్కో గ్రామాన్ని సందర్శించి ఇంటింటికి తిరిగి సర్వే చేసి రక్త పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలన్నారు. గ్రామాలు, సబ్‌సెంటర్లు, పాఠశాలల్లో చికిత్స అందించే ఫొటోలు తీసి వాట్సప్ గ్రూప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రతీ పీహెచ్సీ పరిధిలో వెయ్యి టీమ్‌లు ఏర్పడేటట్లు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రతీ టీం కనీసం 10 రక్త పూతలు తీసి పరీక్షలు నిర్వహించాలని, తద్వారా వచ్చిన మలేరియా కేసులకు వెంటనే చికిత్స అందించే వీలుంటుందన్నారు. జిల్లాలో పనిచేస్తున్న వైద్యాధికారులు, సూపర్వైజర్లు, సిబ్బంది కలిసి టీం వర్క్ చేసినట్లైతే జిల్లాలో రోజుకు 1000 గ్రామాలు సందర్శించి, అక్కడ ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి, వ్యాధులను అరికట్టి జిల్లాను ఆరోగ్య జిల్లాగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా సర్వేలెన్స్ అధికారిణి డాక్టర్ కోటిరత్నం, జిల్లా మలేరియా అధికారి ఏ. రాంబాంబు, డెమో వెంకన్న, డీహెచ్ఈ జి. సాంబశివారెడ్డి, పారామెడికల్ సిబ్బంది, సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
ప్రతిపల్లెకు బీటీరోడ్డు
పంచాయతీ, అంగన్వాడీలకు నూతనభవనాలు పంచాయతీరాజ్ సీఈ సత్యనారాయణరెడ్డి షాద్‌నగర్ రూరల్: రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతిపల్లెకు బీటీరోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8695 గ్రామపంచాయతీలు ఉన్నాయని, అందులో 460పంచాయతీలకు బీటీరోడ్లు లేవని చెప్పారు. అన్ని పంచాయతీలకు బీటీ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గురువారం పట్టణంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 460 గ్రామపంచాయతీలకు బీటీ రోడ్డు లేదని, అందులో పాలమూరు జిల్లాలోనే 185 ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1000 నూతనపంచాయతీ భవనాలు, 1063 నూతన అంగన్వాడీ భవనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మహబూబ్నగర్జిల్లాకు 144 నూతన గ్రామపంచాయతీ భవనాలు మంజూరు అయ్యాయని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 264 భవనాలను త్వరలోనే పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. అంగన్వాడీ, పంచాయతీ, మహిళాసమాఖ్య భవన నిర్మాణాలను పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోనే చేపట్టనున్నామని తెలిపారు. 1163 అంగన్‌భవనాలను అక్టోబర్31 నాటికి పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాకు 74 అంగన్వాడీ భవనాలు జిల్లాకు 74 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. రూ. 8లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడతగా 1064 అంగన్‌వాడీభవనాల్లో 550 అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు రూ. 3లక్షల చొప్పున ఐసీడీఎస్, రూ.5లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి కేటాయిస్తామని తెలిపారు. నూతన భవనాల నిర్మాణాలలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ జిల్లాఎస్‌ఇ రఘు, ఎగ్జిక్యూటివ్‌ఇంజనీర్ అశోక్, షాద్‌నగర్ డిప్యూటి ఇఇ సంజీవచారి, ఎఇలు శ్రీనివాసులు, యాదగిరి, ఎం.శ్రీనివాస్, భూపాల్, కిశోర్‌బాబు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి గ్రామపంచాయతీలో మొక్కలు నాటాలి
సూర్యాపేటరూరల్ : ప్రతి గ్రామపంచాయతీలో తప్పనిసరిగా 40 వేల మొక్కలు నాటాలని సూర్యాపేట తహసీల్దార్ మహమూద్‌అలీ, ఎంపీడీఓ నాగిరెడ్డి కోరారు. మంగళవారం సూర్యాపేట మండల సమాఖ్య కార్యాలయంలో హరితహారంలో భాగంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేసిన యాక్షన్‌ప్లాన్‌కు సంబంధించి నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటివరకు మండలంలో రెండు లక్షల మొక్కలు నాటామని.. మరో ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, రైతులకు అదనపు ఆదాయాన్నిచ్చే, ఇళ్లలో నాటేందుకు ప్రజలకు కావాల్సిన మెుక్కలు అందజేసి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏపీఓ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు, వివిధ గ్రామాల నోడల్ అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు
- ఆర్టీసీ హైదరాబాద్ ఈడీ జయరావు - మహేశ్వరం డిపోలో కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం మహేశ్వరం: ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడమే ఆర్టీసీ లక్ష్యమని గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరాజ్ పేర్కొన్నారు. మహేశ్వరం ఆర్టీసీ డిపోలోని 9 కొత్త బస్సులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగాగా మాట్లాడుతూ... ప్రతి గ్రామం, గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అం దించేందుకు కృషి చేస్తామని అన్నారు. డిపో ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్ బంక్ లేక పోవడంతో బస్సులు నడపడానికి కొంత ఆలస్యం జరిగిందన్నారు. మొన్నటివరకు మిథాని డిపో నుంచి బస్సు సర్వీసులు నడిచేవని, ఇక నుంచి నేరుగా మహేశ్వరం డిపో నుంచే నడుస్తాయన్నారు. కల్వకోల్, సిద్దాపూర్, బాచుపల్లి, కొత్తపేట్, పెద్దమ్మతండా, తిమ్మాపూర్, మురళీనగర్, అన్నోజి గూడ, అమీర్‌పేట్ గ్రామాలకు కొత్త సర్వీసులను ప్రారంభించారు. త్వరలో మరిన్ని సర్వీసులను పెంచుతామని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ రీజినల్ మేనేజర్ జయరావు, డీవీఎం సూర్యకిరణ్, ఎంపీపీ పెంటమల్ల స్నేహ, జేడ్పీటీసీ సభ్యుడు నేనావత్ ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ మునగపాటి నవీన్, సర్పంచ్ ఆనందం, ఉప సర్పంచ్ రాములు, ఎంపీటీసీ సభ్యులు బంగరిగళ్ల ప్రేమలత, బుజ్జి భద్రునాయక్, డిపో మేనేజర్ పవిత్ర, ట్రాఫిక్ ఇన్చార్జిలు బి.ప్రభాకర్, శివరంజన్ పాల్గొన్నారు.