ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం: కేటీఆర్
హైదరాబాద్: ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం హెచ్‌ఐసీసీలో జరిగిన ఐకాన్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ తెలంగాణలో 25 వేల గ్రామాలకు 2ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ అందిస్తామన్నారు. సైబర్ సెక్యురిటీ పాలసీని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణనే అని కేటీఆర్ చెప్పారు.
సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఐటీ రంగంలో హైదరాబాద్ దేశానికే రోల్‌మోడల్ అని అన్నారు. సైబర్ దాడులకు సంబంధించి ఐకాన్ పాలసీ రూపొందించాలని ఆయన సూచించారు. దేశవ్యాప్తంగా 19 వేల స్టార్టప్స్ ఉన్నాయని తెలిపారు. స్థానిక భాషల్లో డొమైన్ నేమ్స్‌పై ఐకాన్ దృష్టి పెట్టాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు.