
భారత క్రికెట్ అభిమానులకు ఎంఎస్ ధోనిపై ఉన్న ఆదరణ తెలియనిది కాదు. తన ఆటలోని ప్రత్యేకత అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రజల అభిమానాన్ని సంపాదించిన ఆయనను కంపెనీలు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుని వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తూ మరింత లాభాలు సంపాదిస్తుంటాయి. అయితే తాజాగా హైదరాబాద్‌కు చెందిన మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది.
మాక్సివిజన్ ఐ హాస్పిటల్స్ గ్రూప్ సీఈఓ సుధీర్ మాట్లాడుతూ ‘మాక్సివిజన్‌లో మొత్తం 40+ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతిరోజూ వేలాది మంది రోగులకు కంటి సంరక్షణ సేవలను అందిస్తున్నాం. మారుతున్న జీవనశైలిలో భాగంగా చాలా మంది గ్లుకోమా, రెటీనా సమస్యల వల్ల బాధపడుతున్నారు. కంటి చెకప్‌ల ద్వారా ఈ వ్యాధులను నివారించే అవకాశం ఉంటుంది. మ్యాక్సివిజన్ కంటి సంరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, ఆన్-గ్రౌండ్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఎంఎస్ ధోని వంటి ప్రముఖ వ్యక్తి ఇందులో భాగం అవ్వడం హర్షణీయం’అని అన్నారు.
ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్
స్పష్టమైన దృష్టితో క్రీడలు, జీవితంలో విజయం సాధించవచ్చని మ్యాక్సివిజన్ ఐ హాస్పటల్స్ బ్రాండ్ అంబాసిడర్ ఎంఎస్ ధోని అన్నారు. తరచూ కంటి పరీక్షల చేసుకోవడంతో వాటిని సంరక్షించుకోవచ్చని తెలిపారు. ఈ రంగంలో మాక్సివిజన్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment