
సాక్షి, బాపట్ల: బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. కాఫీ పొడి, ఉప్పు, శానిటైజర్‌ను ఓ విద్యార్థిని మిశ్రమంగా చేసింది. ఆ మిశ్రమాన్ని వాసన చూసిన 20 మందికి విద్యార్థులకు అస్వస్థత గురయ్యారు. ఊపిరి ఆడకపోవడంతో పలువురు ల్యాబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఉపాధ్యాయులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments
Please login to add a commentAdd a comment