సన్నీ లియోన్‌ని ఆదర్శంగా తీసుకో! | Sunny Leone should be role model, principal to student | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్‌ని ఆదర్శంగా తీసుకో!

Published Sat, Feb 4 2017 9:42 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

సన్నీ లియోన్‌ని ఆదర్శంగా తీసుకో! - Sakshi

సన్నీ లియోన్‌ని ఆదర్శంగా తీసుకో!

  • విద్యార్థినితో ప్రిన్సిపాల్‌ అసభ్య ప్రవర్తన
     
  • బెంగళూరు: ’బాయ్‌ఫ్రెండ్‌ను పెట్టుకో. సన్నీ లియోన్‌ ఆదర్శంగా తీసుకో. శృంగార సాధనాలు వాడు. నన్ను తరచూ కలుస్తూ ఉండు. నేను నీకు నైతికంగా, సామాజికంగా, ఆర్థికంగా మద్దతుగా నిలుస్తాను. నా మాట వినలేదనుకో.. నీకు క్లాస్‌ ఫస్ట్‌ మార్కులు వచ్చే అవకాశాలు కోల్పోతావు’ .. ఓ విద్యార్థినితో ప్రిన్సిపాల్‌ చెప్పిన మాటలివి.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన వాడే.. దారితప్పి ఇలా విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. నగరంలోని సీవీ రామన్‌ రోడ్డులో ఉన్న కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ కుమార్‌ ఠాకూర్‌ తన పట్ల ఇలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ 12వ తరగతి విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    గత నెల 26న రాత్రి 7.20 గంటల నుంచి 8.10 మధ్య ఈ ఘటన జరిగింది. ఫిజిక్స్‌ టీచర్‌ షణ్ముగం తనను ప్రిన్సిపాల్‌ చాంబర్‌కు తీసుకెళ్లాడని, అక్కడ తనను తరచూ కలువాలంటూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తనకు ప్రిన్సిపాల్‌ చాక్లెట్‌ ఇచ్చాడని, ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే బయట లైట్లు కూడా లేవని తెలిపింది.

    కేంద్రీయ విద్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన వెలుగుచూడటంతో నిపుణులు, డీపీఐ అధికారులు శుక్రవారం విద్యాలయాన్ని సందర్శించి.. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. బాధిత విద్యార్థినిపై లైంగిక వేధింపులకు మునుపే ప్రిన్సిపాల్‌పై పలు ఫిర్యాదులు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ 1098కు అందాయి. పదో తరగతి నుంచి 12వ తరగతి అమ్మాయిలను ప్రిన్సిపాల్‌ కుమార్‌ లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్నాడని కేవీ ఉద్యోగి ఒకరు చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ దృష్టికి తీసుకొచ్చారు. సంచలనం సృష్టించిన ఈ లైంగిక వేధింపుల ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు కుమార్‌ ఠాకూర్‌కు జారీచేసిన బెయిల్‌ రద్దు చేయాలని ఇప్పటికే నోడల్‌ చైల్డ్‌హెల్ప్‌లైన్‌ అధికారులు బెంగళూరు డీసీపీకి లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement