కరోనా: ఇలా కూడా మద్యం తాగొచ్చు | Cheers With Social Distance Viral Video | Sakshi
Sakshi News home page

సోషల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ.. చీర్స్‌

Published Wed, Apr 15 2020 5:41 PM | Last Updated on Wed, Apr 15 2020 5:59 PM

Cheers With Social Distance Viral Video - Sakshi

కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. తాము అగ్రరాజ్యాలంటూ గొప్పలు చెప్పుకునే అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా కోవిడ్‌కు తలవంచక తప్పలేదు. అయితే ఈ ప్రమాదకర వైరస్‌ను అరికట్టేందుకు ఔషధం లేకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ సామాజిక దూరం అనే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. మనుషులు దగ్గర దగ్గరగా ఉంటే వైరస్‌ సోకే అవకాశం ఉండటంతో ఈ నియమం పాటించక తప్పడంలేదు. ఈ క్రమంలోనే మద్యం ప్రియులు సామాజిక దూరం పాటిస్తూ ఆల్కహాల్ సేవిస్తున్నారు. గ్లాసులకు సహకారంగా కర్రలు కట్టి.. ఒకరికొకరూ దూరంగా ఉండి చీర్స్‌ కొడుతూ ఏంజాయ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా.. దీనిపై కామెంట్లు పెద్ద ఎత్తున వస్తున్నాయి.

ఈ వీడియోపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్పందించారంటే వారి ఆలోచన ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. సామాజిక దూరం పాటిస్తూ వారు మద్యం సేవించే విధానాన్ని జిన్‌పింగ్‌ ఫిదా అయ్యారు. వారిని అభినందిస్తూ ఓ పోస్ట్‌ సైతం చేశారు. ఇక దీనిపై నెటిజన్లు వారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. మనకు తరువాత ఇచ్చే టాస్క్‌ ఇదే అని ఓ నెటిజన్‌ కామెంట్‌ పెట్టగా.. దేశంలో వైన్‌ షాపులను త్వరగా తెరవండీ అంటూ మరో వ్యక్తి వేడుకుంటున్నాడు.  వైరస్‌ బారిన పడకుండా ఆల్కహాల్ ఇలా కూడా సేవించవచ్చు అని మరొకరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ వీడియో చైనాకు చెందినదిగా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement