సాక్షి, హైదరాబాద్: మాస్కు ఉల్లంఘనలపై వరుసగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు ఇకపై భౌతికదూరం పాటించకున్నా.. చర్యలు తీసుకోనున్నారు. రోడ్డు పై ఎక్కడైనా ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువగా గుమిగూడినా.. పోలీసులు క్షణాల్లో అక్కడికి వచ్చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను సీసీ కెమెరాలకు జోడించి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. భౌ తికదూరం పాటించకుండా.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీజీపీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో హెచ్చరించింది. దేశంలోనే ఇలాం టి సాంకేతికతను తొలిసారిగా తెలంగాణలో ప్రవేశపెట్టామని తెలిపింది. తొలుత ఈ సాంకేతికతను గ్రేటర్ పరిధిలోని రాచకొండ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో, ఆపై రాష్ట్రంలో అమలు చేయనున్నారు.
క్షణాల్లో వచ్చేస్తారు: కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు శాఖ ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పుడు ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సులు సేవలు ప్రారంభించడంతో పలుచోట్ల రోడ్లు, కూడళ్లలో రద్దీ ఏర్పడుతోంది. సీసీ కెమెరాల సాయంతో కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ద్వారా ఉల్లంఘన ఎక్కడ జరుగుతుందో సిబ్బంది గుర్తిస్తారు. వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న గస్తీ పోలీసులను అప్రమత్తం చేస్తారు. వారు ఉల్లంఘనల ప్రాంతానికి వెళ్లి.. భౌతికదూరం పాటించని ప్రజలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తారు. మరీ ఉల్లంఘనలు అధికంగా ఉంటే కేసులు నమోదు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment