సాక్షి, న్యూఢిల్లీ : వర్ధమాన బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వార్త ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అంతకుముందు మే 19వ తేదీన సూరత్‌లో చిక్కుకు పోయిన అస్సామీ కార్మికుడొకరు ఉపాధి కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నారు. జూన్ 16వ తేదీన ఢిల్లీలో కూరగాయల అమ్ముకుంటూ బతుకుతున్న 40 ఏళ్ల వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజు ఇలాంటి ఆత్మహత్యలు ఎన్నో జరగుతుంటాయి. ఆత్మహత్యలు చేసుకున్న వారిలో సినిమా యాక్టర్లు, బడా వ్యాపారవేత్తలు, ప్రముఖ క్రీడాకారులతోపాటు సామాన్య మానవులు ఉన్నారు. అవన్నీ ‘మానసిక కారణాల’తో చేసుకున్న ఆత్మహత్యలని వైద్యులు సులువుగా తేల్చి పారేస్తారు. లేదా సామాజిక–ఆర్థిక ఒత్తిడి అని కూడా కొందరు వైద్య నిపుణులు తేలుస్తున్నారు.(సుశాంత్ ఆత్మహత్య: ప్రముఖులపై కేసు)
ఆత్మహత్యలన్ని కూడా సమాజంతో ముడి వడి ఉన్నవే. సామాజిక గమనాన్ని తెలియజేసేవే. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయీ ఆత్మహత్య చేసుకోవడం వెనక కూడా సామాజిక కోణమే ఉంటుంది. సహజంగా సమాజం ఒప్పుకోదన్న కారణంగానే ఆ యువతిగానీ యువతిగానీ ఆ ప్రేమకు ఒప్పుకొని ఉండకపోవచ్చు. ‘ఎలా చావాలన్నది కూడా వినియోగదారుడి ఎంచుకునేదే’ అని ‘డైయింగ్ ఆఫ్ లోన్లీలెస్’ పుస్తకంలో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త నార్బట్ ఇలియాస్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఒంటరితనం అంటే సమాజం తనను ఒంటరిని చేసిందనే భావనే. ఆ భావనే ఆత్మహత్యలకు దారి తీస్తుంది. ఉపాధి కోల్పోయిన వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆదుకోవాల్సిన సమాజం అతన్ని ఒంటరని చేసిందన్న భావమే, మరో విధంగా చెప్పాలంటే సామాజిక దూరమే ఆత్మహత్యకు పురిగొల్పుతుంది. ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నట్లయితే సానుభూతి చూపించే సమాజం, ఆ చావుకు తాము కూడా బాధ్యులమనే విషయాన్ని గ్రహిస్తే ఆత్మహత్యలు తగ్గుతాయని ‘లివింగ్ అండ్ డైయింగ్’ పుస్తకం రాసిన సామాజిక శాస్త్రవేత్త దేవ్‌నాథ్ పాఠక్ సూచిస్తున్నారు. (కరణ్ నంబర్ ఇచ్చాడు కదా అని ఫోన్ చేస్తే..)
Comments
Please login to add a commentAdd a comment