
సుశాంత్ సింగ్, రియా చక్రవర్తి
న్యూఢిల్లీ/ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ మిస్టరీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. త్వరలో వీరందరినీ విచారించనున్నట్లు సమాచారం. సుశాంత్ మరణంపై ఎట్టకేలకు అతని ప్రియురాలు రియా చక్రవర్తి స్పందించింది. శుక్రవారం విడుదల చేసిన వీడియోలో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా చెప్పుకుంది.‘సుశాంత్ మృతి కేసు కోర్టులో ఉన్నందున..లాయర్ల సూచన మేరకే ఇప్పటి వరకు ఎలక్ట్రానిక్ మీడియాతో నాపై వచ్చిన కథనాలపై స్పందించలేదు. సత్యం జయిస్తుంది’అని పేర్కొంది. సీబీఐతో ఈ కేసు విచారణ జరిపించాలని హోం మంత్రి అమిత్‌షాను ఆమె కోరింది.
Comments
Please login to add a commentAdd a comment