
అతను చాలా మానసికంగా కృంగిపోయినట్లు కమిషనర్ తెలిపారు
ముంబై : బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. చనిపోవడానికి ముందు సుశాంత్ .. మరణం గురించి ఇంటర్నెట్‌లో వెతికినట్లు ముంబై పోలీసులు తెలిపారు. అలాగే తన పేరును కూడా గూగుల్‌లో సెర్చ్ చేశాడని పేర్కొన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన వివరాలను సోమవారం ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వెల్లడించారు. (చదవండి : రక్షాబంధన్ : సుశాంత్ సోదరి భావోద్వేగం)
నొప్పి లేకుండా చనిపోవడం ఎలా? అని సుశాంత్ గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు తెలిపారు. మాజీ మేనేజర్ దిషా సాలియన్ ఆత్మహత్యకు, తనకు లింక్ ఉందనే తరహా కథనాలు సుశాంత్ చదివేవాడని కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వెల్లడించారు. జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటలకు ముందు సుశాంత్ అతని పేరునే గూగుల్ చేశాడని.. ఈ విషయాలన్నీ కూడా తన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ ద్వారా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడ్డాయని పరమ్ బీర్ చెప్పారు . అతను చాలా మానసికంగా కృంగిపోయినట్లు కమిషనర్ తెలిపారు. (చదవండి : సుశాంత్ మరణం : షాకింగ్ వీడియో )
కాగా, సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలపై సుశాంత్ ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడన్నారు. చివరి క్షణాల్లో తన స్వంత పేరునే సుశాంత్ ఇంటర్నెట్‌లో పలుమార్లు సెర్చ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు