
ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని కట్టడి చేసేందుకు భౌతిక దూరం పాటించడం సహా పలు జాగ్రత్తలు తీసుకోవడమే మన ముందున్న మార్గాలు. చికిత్స కంటే నివారణే మేలు అన్నచందంగా ఇప్పటికే పలువురు ఇంటికే పరిమితమయ్యారు. మరికొందరు మాత్రం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ రోడ్ల మీద సంచరిస్తున్నారు. తమతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో భౌతిక దూరం ఆవశ్యకతను చాటిచెబుతూ కొంతమంది చిన్నారులు రూపొందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.(2022 వరకు భౌతిక దూరం పాటిస్తేనే..)
ఇటుకలను వరుసగా పేర్చి వాటి ద్వారా సామాజిక దూరం పాటించకపోతే ఎదురయ్యే ఇబ్బందుల గురించి ప్రయోగాత్మకంగా వివరించిన చిన్నారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బ్రిలియంట్ కిడ్స్.. నిజమైన స్టార్లు అంటూ కామెంట్లు చేస్తున్నారు. భారత అటవీ శాఖ అధికారి ప్రవీణ్ కశ్వాన్ షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లును విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇక అగ్గిపుల్లలతో కూడా ఇదే తరహాలో భౌతిక దూరం ప్రాధాన్యతను వివరిస్తున్న పలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment