వినూత్న ఆలోచన.. ఆటోలో 5 అరలు! | Watch, Anand Mahindra Shared Video Of Social Distancing In E Rickshaw | Sakshi
Sakshi News home page

వినూత్న ఆలోచన.. ఆటోలో 5 అరలు!

Published Fri, Apr 24 2020 8:41 PM | Last Updated on Fri, Mar 22 2024 11:26 AM

హైదరాబాద్‌: మందుల్లేని మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక, భౌతిక దూరాలు పాటించడమే మన ముందున్న మార్గం. ఈ నేపథ్యంలో ఈ-ఆటోరిక్షాను అరలుగా మార్చి ప్రయాణికులకు సామాజిక దూరం వెలుసుబాటు కల్పించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉండే మహింద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా.. ఆటోరిక్షాను ఐదు భాగాలుగా విభజించిన సదరు డ్రైవర్‌ వినూత్న ఆలోచనపై ప్రశసంలు కురిపించారు.

‘క్లిష్ట పరిస్థితుల్లో వేగవంతమైన, వినూత్న ఆలోచనలు చేయగల సామర్థ్యం మన సొంతం. నూతన పరిస్థితులకు అనుగుణంగా విభిన్న ఆలోచనలు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి’అనే క్యాప్షన్‌తో ఆనంద్‌ మహింద్రా వీడియో షేర్‌ చేశారు. మహింద్రా ఆటో, ఫార్మ్‌ సెక్టార్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ జెజురికర్‌ను ఈ ట్వీట్‌కు ట్యాగ్‌ చేశారు. తమ ఆటో బిల్డింగ్‌ కంపెనీలో ఈ-ఆటోరిక్షా డ్రైవర్‌ను సలహాదారుగా పెట్టుకుందామని పేర్కొన్నారు. కాగా, 27 సెకండ్ల నిడివిగల ఈ వీడియోకు 10 వేల వ్యూస్‌ రాగా.. 9 వేల లైకులు వచ్చాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement