ఇస్లామాబాద్: భారత్‌పై విషాన్ని చిమ్మి వార్తల్లో నిలిచే పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఈసారి ఓ బిత్తిరి చర్యతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. పాకిస్తాన్‌లోని ముల్తాన్‌లో ఇటీవల నిర్మించిన రోడ్డును ప్రారంభించడానికి వచ్చిన ఖురేషీ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి వార్తల్లో నిలిచారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఒక పెద్దకేకును కట్ చేశారు. కరోనా నిబంధనల్ని మరచి.. కేక్ కావాలా తీసుకొండని మంత్రి అక్కడున్న జనానికి సూచించారు.
దీంతో కారక్రమానికి హజరైనవారు కేక్ ముక్క కోసం ఎగబడ్డారు. వారిలో ఏఒక్కరు కూడా సామాజిక దూరం పాటించలేదు. మాస్క్‌లు ధరించలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాస్కు ధరించిన మంత్రి ఖురేషీ కూడా కేక్ కోసం అర్రులు చాచాడు. తన నోటికి మాస్కు ఉందన్న సంగతి మరచి.. కేక్ తినేందుకు ఆరాటపడ్డాడు. మంత్రిగారి వ్యవహారానికి సంబంధించిన వీడియోను పాక్ జర్నలిస్ట్ నాయ్‌లా ఇనాయత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఖురేషీ ప్రవర్తన పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో బాధ్యత గల పదవిలో ఉండి ఇవే పిల్ల చేష్టలు అని తిట్టిపోస్తున్నారు.
చదవండి: భారీగా తగ్గిన అంతర్జాతీయ వలసలు!
Comments
Please login to add a commentAdd a comment