కరోనా కారణంగా చేయి చేయి కలపొద్దు అంటున్నారు. సామాజిక దూరం పాటించమంటున్నారు. అయితే బాలీవుడ్ దర్శకుడు సూజిత్ సర్కార్‌కి ఓ విచిత్రమైన సందేహం వచ్చింది. అదేంటంటే... కరోనా వైరస్ హడావిడి మొత్తం తగ్గిన తర్వాత సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఎలా చిత్రీకరిస్తారు? అన్నదే ఆ డౌట్. ఈ సరదా సందేహాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
‘సినిమాల్లో వచ్చే ముద్దు సన్నివేశాలు, కౌగిలించుకునే సన్నివేశాలు ఎలా చిత్రీకరిస్తారో చూడాలి. ఒకవేళ అలాంటి సీన్లను తీసేటప్పుడు నటీనటుల మధ్య కాస్త గ్యాప్ ఉండేలా చేసి, ఆ తర్వాత దగ్గరగా ఉన్నట్లు చూపించాల్సి వచ్చినా రావొచ్చు. అలా మోసం చేసి అయినా కథలు చెప్పాల్సిందే కదా’’ అని సూజిత్ పేర్కొన్నారు. ‘విక్కీ డోనర్’, ‘మదరాస్ కేఫ్’, ‘పీకు’ వంటి చిత్రాల ద్వారా తనలో మంచి దర్శకుడు ఉన్న విషయాన్ని నిరూపించుకున్నారు సూజిత్.
Comments
Please login to add a commentAdd a comment