తిరుపతి : తిరుపతి నగరంలోని రుయా ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారి శనివారం మృతి చెందింది. శుక్రవారం ఇదే అసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్న వరుస మరణాలపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.