ఏటూరునాగారం (వరంగల్): వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలో గురువారం రాత్రి గోదావరి నదిలో మునిగి ఒక చిన్నారి మృత్యువాతపడింది. వివరాలు.. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొట్టె వెంకటేశ్వర్లు, శైలజ దంపతులు తమ కుమార్తె ప్రియాంతి (3) తో కలిసి బుధవారం గోదావరి ఆవలిగట్టున ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లారు.
తిరుగు ప్రయాణంలో గురువారం రాత్రి వారు పడవ ఎక్కారు. రాత్రి పది గంటల సమయంలో పడవ తీరానికి చేరింది. కిందికి దిగే క్రమంలో ప్రమాదవశాత్తూ వారు ముగ్గురూ నీళ్లలో పడిపోయారు. ప్రియాంతి నీటిలో మునిగి చనిపోగా.. వెంకటేశ్వర్లు, శైలజలను తోటి ప్రయాణికులు కాపాడారు.
గోదావరిలో మునిగి చిన్నారి మృతి
Published Fri, May 29 2015 10:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement