ట్యాంకర్ ఢీకొని చిన్నారి మృతి | child dies in water tanker accident | Sakshi
Sakshi News home page

ట్యాంకర్ ఢీకొని చిన్నారి మృతి

Published Sat, Aug 8 2015 6:47 PM | Last Updated on Sun, Sep 3 2017 7:03 AM

child dies in water tanker accident

నారాయణపేట్: ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చిన నాలుగేళ్ల చిన్నారిని నీటి ట్యాంకర్ బలి తీసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట్‌లోని బీసీ కాలనీలో శనివారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ఎస్‌ఐ రామలింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నీటితో ట్యాంకర్ బీసీ కాలనీలో వెళుతుండగా.. రేఖ అనే నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ ఇంట్లోంచి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది.

డ్రైవర్ గమనించి ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ట్యాంకు వెనుక టైర్ కిందపడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన తర్వాత స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement