రాయదుర్గం టౌన్ : రాయదుర్గం పట్టణంలోని 21వ వార్డు మారెమ్మగుడి సమీపంలో పది నెలల చిన్నారి ఎన్.జస్మిత్ డెంగీ లక్షణాలతో శనివారం ఉదయం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. తిప్పేస్వామి, రాధ దంపతులకు మూడేళ్ల కుమారుడు, పది నెలల కుమార్తె జస్మిత్ ఉన్నారు. గత ఆదివారం జస్మిత్‌కు జ్వరం రావడంతో ఆర్‌ఎంపీతో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో బళ్లారి విమ్స్‌కు తీసుకెళ్లారు. ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువ స్థాయికి పడిపోవడంతో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు. కాగా ఇదే నెల ఒకటో తేదీ తహసీల్దార్ రోడ్డులో అల్తాఫ్ కుమార్తె ఆయేషా(6) డెంగీతో మృతి చెందిన విషయం తెలిసిందే. 20 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదిలావుండగా పట్టణంలోని అన్ని వార్డుల్లో విషజ్వరాల తీవ్రత అధికంగా ఉంది. ప్రతిరోజూ ఆస్పత్రికి దాదాపు 500 దాకా రోగులు వస్తుండగా ఇందులో 50కిపైగా జ్వర పీడితులు ఉంటున్నారు. వారంరోజుల క్రితం కూడా ముగ్గురికి డెంగీ పాజిటివ్‌గా గుర్తించి అనంతపురంలో చికిత్సలు అందజేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించడం వల్లే జ్వరాలు ప్రబలుతున్నాయని ప్రజలు చెబుతున్నారు.
డెంగీ లక్షణాలతో చిన్నారి మృతి
Published Sat, Jul 15 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM
Advertisement