చెన్నేకొత్తపల్లి(రామగిరి): చెన్నేకొత్తపల్లి మండలం చందమూరు గ్రామానికి చెందిన ఈశ్వరయ్య కుమారుడు నవీన్ (9) న్యుమోనియాతో గురువారం రాత్రి మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు.. ధర్మవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న నవీన్ ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు చెన్నేకొత్తపల్లి, ధర్మవరం ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. అయినా తగ్గకపోవడంతో బెంగుళూరుకు తరలించారు. వైద్యపరీక్షల్లో న్యుమోనియాతో బాధపడుతున్నట్లు తేలింది. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.