యాడికి : బడికి పోయి ఉన్నా మాకు నువ్వు దక్కేదానివి కదమ్మా అంటూ ఆ తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహంపై పడి రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ఊయల బిగుసుకుని ప్రగతి (11) అనే బాలిక ఊపిరి ఆగిపోయింది. స్థానికులు తెలిపిన మేరకు... పిన్నేపల్లి గ్రామానికి చెందిన రవీంద్రనాథ్‌రెడ్డి,వరలక్ష్మి దంపతులకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె ప్రగతి చిన్నది కావడంతో ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు.
ప్రగతి మండల కేంద్రం యాడికిలోని ప్రైౖవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. మంగళవారం ‘అమ్మా చెవిలో నొప్పిగా వుంది. ఈరోజు స్కూలుకు వెళ్లను’ అని చెప్పడంతో సరే ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండమ్మా అని తల్లిదండ్రులు పొలానికి వెళ్లారు. ఇంటిలో ఉన్న ఊయల ఊగుతూ ఆడుకుంటోంది. అయితే ఉన్నపళంగా ఊయల మెడకు బిగుసుకోవడంతో ఊపిరాడక పాప మృతి చెందింది. మధ్యాహ్నం పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు విగతజీవిగా కుమార్తె కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు.
ఊపిరి తీసిన ఊయల
Published Wed, Aug 17 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
Advertisement
Advertisement