అనంతపురం అగ్రికల్చర్ : ఈనెల 25న పెనుకొండ వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రాంగణంలో పట్టు రైతుల సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ప్రాంతీయ పట్టు పరిశోధనా కేంద్రం (ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్) శాస్త్రవేత్త డాక్టర్ ఎంఏ శాంతన్‌బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌ఎస్‌ఆర్‌ఎస్‌తో పాటు కేంద్ర పట్టుమండలి, జౌళి మంత్రిత్వశాఖ, ఏపీ పట్టుపరిశ్రమశాఖ సంయుక్తంగా బైవోల్టీన్ పట్టుగూళ్ల పెంపకం, అధిక దిగుబడులు, అధునాతన సాంకేతిక పద్ధతులు, ఆర్థికాభివృద్ధి తదితర అంశాలపై సమ్మేళనంలో చర్చించడం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు హాజరవుతారని తెలిపారు. పెద్ద సంఖ్యలో పట్టు రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.