శ్రీసత్యసాయి జిల్లా: వైఎస్సార్‌సీపీకి చెందిన పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యే శంకర్ నారాయణ కారుపై దుండగులు బాంబు దాడి చేశారు. బాంబు పేలకపోవటంతో ప్రమాదం తప్పింది. గోరంట్ల మండలం గడ్డం తాండాలో ఈ ఘటన జరిగింది.
ఎమ్మెల్యే శంకర్ నారాయణ్ తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. దుండగులు బాంబులు విసిరారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసి ఓ నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే శంకర్ నారాయణపై ఎలక్ట్రికల్ డిటోనేటర్ విసిరినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పవర్ సప్లై లేకపోవడం వల్ల అది పేలలేదని గుర్తించారు. మద్యం మత్తులో డిటోనేటర్ విసిరినట్లు భావిస్తున్నామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.. దుండగుడి పేరు గణేష్గా గుర్తించామని పేర్కొన్నారు. నిందితునిది సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంగా గుర్తించామని,. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని గోరంట్ల సీఐ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.
నా హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్చి ఉంది
నాపై హత్యాయత్నం వెనుక ఎవరున్నారో తేలాల్సి ఉందని పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ అన్నారు. కుట్ర కోణాన్ని పోలీసులు చేధించాలని డిమాండ్ చేశారు. దేవుడి దయతో ప్రమాదం నుంచి బయటపడ్డానని చెప్పారు. డిటోనేటర్ పేలి ఉంటే ఘెర ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. నాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నానని ఎమ్మెల్యే శంకర్ నారాయణ చెప్పారు.
ఇదీ చదవండి: ప్రజల దృష్టిని మరల్చేందుకు ఎల్లో మీడియా కుట్ర: మంత్రి కాకాణి
Comments
Please login to add a commentAdd a comment