జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. అనంతపురం నుంచి బెంగళూరు వెళుతున్న కారు శుక్రవారం సాయంత్రం పెనుకొండ సమీపంలోకి రాగానే టైర్ పంక్చర్ అయింది.
పెనుకొండ (అనంతపూర్) : జాతీయ రహదారిపై ఓ కారు దగ్ధమైంది. అనంతపురం నుంచి బెంగళూరు వెళుతున్న కారు శుక్రవారం సాయంత్రం పెనుకొండ సమీపంలోకి రాగానే టైర్ పంక్చర్ అయింది. దాంతో కారు అదుపుతప్పి రహదారి పక్కకు దూసుకుపోయింది. టైర్ పంక్చర్ అయిన సమయంలో వచ్చిన నిప్పు రవ్వలతో మంటలు అంటుకున్నాయి. కారులో ఉన్న నలుగురు హుటాహుటిన దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. రహదారిపై కారు పూర్తిగా దగ్ధమయ్యింది.