ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతోంది. తాజాగా కుంభమేళా ప్రాంతంలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ పార్క్ చేసిన ఒక కారు నుంచి మంటలు వెలువడ్డాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. దీంతో అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను వెంటనే అదుపులోకి తెచ్చింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే కారు సగం మేరకు దగ్ధమైపోయింది.
ఈ సంఘటన గురించి అగ్నిమాపక అధికారి విశాల్ యాదవ్ మాట్లాడుతూ ‘అనురాగ్ యాదవ్ అనే వ్యక్తి నుండి మాకు కాల్ వచ్చింది. ఒక కారు మంటల్లో చిక్కుకుందని ఆయన తెలిపారు. వెంటనే వెళ్లి మంటలను అదుపులోనికి తెచ్చాం. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు’ అని తెలిపారు. కాగా కొన్ని రోజుల క్రితం ఇదే కుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాటి సంఘటనలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే గీతా ప్రెస్‌కు నష్టం వాటిల్లింది. ఈ ఘటన దరిమిలా ఎల్‌పీజీ భద్రతపై అధికారులు ఒక ప్రత్యేక సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఎల్‌పీజీ లీకేజీ వల్ల కలిగే ప్రమాదాలను అరికట్టడానికి అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు. కాగా మహా కుంభమేళా ప్రాంతంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, దానిని ఎదుర్కొనేందుకు రెస్క్యూ టీమ్ 24 గంటలూ అందుబాటులో ఉంది.
ఇది కూడా చదవండి: Mahakumbh: మౌని అమావాస్యకు ఎందుకంత ప్రత్యేకత?
Comments
Please login to add a commentAdd a comment