
రైలు పట్టాలపై యువకుడి మృతదేహం
పెనుకొండ : పెనుకొండ–పుట్టపర్తి రైలు మార్గంలో ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని బుధవారం కనుగొన్నట్లు రైల్వే ఎస్‌ఐ ప్రభాకర్ తెలిపారు. రైల్వే ట్రాక్ మధ్యలో యువకుడి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు ఎల్లో కలర్ ఆఫ్ షర్ట్, వైట్ షేడ్ బ్లూ కలర్ జీన్స్ ధరించి ఉన్నట్లు వివరించారు. అయితే అతను ఎవరన్నది అంతుబట్టడం లేదన్నారు. కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్గం కోసం మృతదేహాన్ని పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.