బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఐదో రోజు శనివారం కూడా జిల్లాలో జడి వాన కొనసాగింది. 40 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెనుకొండ మండలంలో 22.4 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా తక్కిన 39 మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. రాప్తాడు, గార్లదిన్నె, యాడికి, పెద్దపప్పూరు, బుక్కపట్టణం, కొత్తచెరువు, పుట్టపర్తి, మడకశిర, అగళి, గోరంట్ల, నల్లమాడ, ఎన్‌పీకుంట, తలుపుల, నల్లచెరువు, గాండ్లపెంట తదితర మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు.
జిల్లా అంతటా 4.7 మి.మీ సగటు నమోదైంది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 82.3 మి.మీ నమోదైంది. భారీ వర్షాలు లేకున్నా చిరుజల్లులు, జడివాన వల్ల వేరుశనగ, పప్పుశనగ, పత్తి రైతులకు ఇబ్బందిగా పరిణమించింది. వేలాది ఎకరాల్లో తొలగించిన వేరుశనగ పొలాల్లో ఎక్కువగా ఉండటంతో నష్టపోయే పరిస్థితి నెలకొంది. కాయలు, మేత లభ్యతపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జడివాన ఇలాగే కొనసాగితే మరింత ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పంటకాలం పూర్తికావడంతో మొలకలు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- న్యూస్‌లైన్, అనంతపురం అగ్రికల్చర్
వర్షాలతో కర్షకులకు కష్టాలు
పెనుకొండ, న్యూస్‌లైన్ : ఎడతెరిపిలేని వర్షాలు కర్షకులకు కష్టాలు తెచ్చాయి. మండలంలోని దుద్దేబండ, మావటూరు, మునిమడుగు, చంద్రగిరి, కొండంపల్లి, శెట్టిపల్లి, గోనిపేట, గొందిపల్లి తదితర గ్రామాల్లో వరి, వేరుశనగ పంటలు వర్షాలకు తడిచిపోయాయి. పొలంలోనే వేరుశనగకాయలు బూజుపట్టాయి. వరి పంట నేలవాలింది. గింజలు రాలిపోయాయి. వేరుశనగ 40 ఎకరాలు, వరి 20 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. ఈ విషయమై వ్యవసాయాధికారి సోమశేఖర్‌ను సంప్రదించగా పంటలు దెబ్బతిన్నమాట వాస్తవమేనన్నారు. వీఆర్వోలు, ఆదర్శరైతుల ద్వారా పంట నష్టం అంచనా వేసి.. పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హెచ్చెల్సీకి భారీగా వరద నీరు
ఉరవకొండ,న్యూస్‌లైన్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి భారీగా వరద నీరు చేరుతోంది. కర్ణాటకలోవారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, దీనికి తోడు కర్నూలు జిల్లా వద్ద ఎల్‌ఎల్‌సీకి గండిపడటంతో ఆ నీటిని అధికారులు హెచ్చెల్సీకి వుళ్లించారు. కాలువకు నీటి ఉధృతి ఎక్కవగా ఉండటంతో నింబగల్లు హెడ్ వద్ద నుంచి పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయుర్(పీఏబీఆర్), మిడ్‌పెన్నార్(ఎంపీఆర్)కు శనివారం నీటిని విడుదల చేశారు. వరద నీరు చేరికతో ప్రస్తుతం హెచ్చెల్సీలో 1200 నుంచి 1700 క్యూసెక్కులకు చేరింది. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ)కు అధికారులు తుంగభద్ర నీటిని శనివారం నిలిపివేశారు.
కల్వర్టు వద్ద ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు
ఉరవకొండ, న్యూస్‌లైన్ : నింబగల్లు - రేణువూకుపల్లి వుధ్య హంద్రీనీవా పిల్ల కాలువ వద్ద నిర్మిస్తున్న కల్వర్టు వద్ద వున్న పెద్ద గుంతల్లో రాయుదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 11జడ్ 5684) ఇరుక్కు పోరుుంది. దీంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోరుుంది. కొంతవుంది ప్రయూణికులు, గ్రావుస్తులు బస్సును తాళ్లతో బయుటకు లాక్కొచ్చారు.
దెబ్బ తిన్న పత్తి
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: జిల్లాలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షా ల వల్ల పత్తి పంట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. పెద్దవడుగూరు, గుత్తి, పామిడి, బొమ్మనహాల్, కణేకల్లు తదితర మండలాల్లో 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి పంట సాగైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు నిలిచింది. తేమ ఆరకపోవడంతో వివిధ రోగాలు, కలుపు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ పేర్కొన్నారు.
అలజడి వాన
Published Sun, Oct 27 2013 3:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement