bengalakhatham
-
జిల్లాలో మళ్లీ వర్షాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పై-లీన్ చేసిన గాయం నుంచి తేరుకోకముందే హెలెన్ తుపాన్ అన్నదాతలను వణికిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా శనివారం వర్షం కురిసింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తెచ్చిన ధాన్యంతోపాటు కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవడంతో రైతన్నకు కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 1.75 లక్షల హెక్టార్లలో వరిపంట సాగయింది. ఇప్పటివరకు 45 శాతం కోతలు మాత్రమే పూర్తయ్యాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 20 లక్షల క్వింటాళ్ల ధాన్యం దెబ్బతిన్నది. అందులో ఆరబెట్టుకున్న ధాన్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. రైతులు నేరుగా మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలకే వచ్చి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. జిల్లాలో ఇంకా 55 శాతం వరికోతలు జరగాల్సి ఉంది. ఆలస్యంగా నాటుకున్న దాదాపు 80వేల హెక్టార్లలో వరికోతలు జరగాలి. దాదాపు 47 లక్షల క్వింటాళ్ల ధాన్యం మార్కెట్‌కు రావాల్సి ఉంది. పొలాల్లో యంత్రాల హార్వెస్టర్లు తిరిగే పరిస్థితి లేదు. ఈ క్రమంలో చైన్ హార్వెస్టర్లకు డిమాండ్ పెరిగింది. అవి తక్కువగా ఉండడం.. కోతలకు ఆలస్యం కావడంతోపాటు ఖర్చులు పెరుగుతున్నాయి. కోతకు వచ్చిన వరిధాన్యం తడిసి రంగుమారే అవకాశముంది. 610 కేంద్రాలు ఎక్కడ? ఖరీఫ్‌లో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం జిల్లాలో 610 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు 345 ఐకేపీ కేంద్రాలు, 191 పీఏసీఎస్‌లు కేంద్రాలు.. మొత్తం 536 కేంద్రాలను ప్రారంభించారు. 9.40 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రూ.39 కోట్లు చెల్లించినట్లు రికార్డులు చెబుతున్నారుు. ప్రభుత్వ సంస్థల కంటే రెండురెట్లు ఎక్కువగా దళారులే కొనుగోలు చేశారు. మార్కెట్ యార్డులతోపాటు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు చేస్తున్న ధాన్యం ఎగుమతికి నోచుకోకపోవడంతో ఎక్కడికక్కడే నిల్వలు పేరుకుపోతున్నాయి. తేమ ఎక్కువగా ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెడుతున్నారు. ఈ క్రమంలో అవసరం మేరకు టార్పాలిన్లు లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికే ధాన్యం తడిసిపోతోంది. ఇదే అదునుగా వ్యాపారులు ధర తగ్గించి రైతులను దోచుకుంటున్నారు. మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యం శనివారం కురిసిన వర్షాలకు కరీంనగర్ మార్కెట్ యార్డులో వరిధాన్యం తడిసింది. నాలుగు వేల క్వింటాళ్ల వరకు మార్కెట్ యార్డుకు ధాన్యం వచ్చింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడంతో రైతులు ముందస్తుగా టార్పాలిన్లు తెచ్చుకుని కుప్పలపై కప్పుకున్నారు. పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో వ్యాపారులు ఇష్టారీతిన ధర నిర్ణయించారు. వర్షసూచన నేపథ్యంలో రైతులు ధాన్యాన్ని కాపాడుకోలేని స్థితిలో వ్యాపారుల చెప్పిన ధరకే విక్రయించారు. వరి ధాన్యం మద్దతు ధర కంటే రూ.100-రూ.250వరకు కోతలు పెట్టారు. -
అలజడి వాన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఐదో రోజు శనివారం కూడా జిల్లాలో జడి వాన కొనసాగింది. 40 మండలాల్లో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెనుకొండ మండలంలో 22.4 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా తక్కిన 39 మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. రాప్తాడు, గార్లదిన్నె, యాడికి, పెద్దపప్పూరు, బుక్కపట్టణం, కొత్తచెరువు, పుట్టపర్తి, మడకశిర, అగళి, గోరంట్ల, నల్లమాడ, ఎన్పీకుంట, తలుపుల, నల్లచెరువు, గాండ్లపెంట తదితర మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా అంతటా 4.7 మి.మీ సగటు నమోదైంది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 82.3 మి.మీ నమోదైంది. భారీ వర్షాలు లేకున్నా చిరుజల్లులు, జడివాన వల్ల వేరుశనగ, పప్పుశనగ, పత్తి రైతులకు ఇబ్బందిగా పరిణమించింది. వేలాది ఎకరాల్లో తొలగించిన వేరుశనగ పొలాల్లో ఎక్కువగా ఉండటంతో నష్టపోయే పరిస్థితి నెలకొంది. కాయలు, మేత లభ్యతపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జడివాన ఇలాగే కొనసాగితే మరింత ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. పంటకాలం పూర్తికావడంతో మొలకలు వచ్చే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - న్యూస్‌లైన్, అనంతపురం అగ్రికల్చర్ వర్షాలతో కర్షకులకు కష్టాలు పెనుకొండ, న్యూస్‌లైన్ : ఎడతెరిపిలేని వర్షాలు కర్షకులకు కష్టాలు తెచ్చాయి. మండలంలోని దుద్దేబండ, మావటూరు, మునిమడుగు, చంద్రగిరి, కొండంపల్లి, శెట్టిపల్లి, గోనిపేట, గొందిపల్లి తదితర గ్రామాల్లో వరి, వేరుశనగ పంటలు వర్షాలకు తడిచిపోయాయి. పొలంలోనే వేరుశనగకాయలు బూజుపట్టాయి. వరి పంట నేలవాలింది. గింజలు రాలిపోయాయి. వేరుశనగ 40 ఎకరాలు, వరి 20 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. ఈ విషయమై వ్యవసాయాధికారి సోమశేఖర్‌ను సంప్రదించగా పంటలు దెబ్బతిన్నమాట వాస్తవమేనన్నారు. వీఆర్వోలు, ఆదర్శరైతుల ద్వారా పంట నష్టం అంచనా వేసి.. పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హెచ్చెల్సీకి భారీగా వరద నీరు ఉరవకొండ,న్యూస్‌లైన్: తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి భారీగా వరద నీరు చేరుతోంది. కర్ణాటకలోవారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, దీనికి తోడు కర్నూలు జిల్లా వద్ద ఎల్ఎల్సీకి గండిపడటంతో ఆ నీటిని అధికారులు హెచ్చెల్సీకి వుళ్లించారు. కాలువకు నీటి ఉధృతి ఎక్కవగా ఉండటంతో నింబగల్లు హెడ్ వద్ద నుంచి పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయుర్(పీఏబీఆర్), మిడ్‌పెన్నార్(ఎంపీఆర్)కు శనివారం నీటిని విడుదల చేశారు. వరద నీరు చేరికతో ప్రస్తుతం హెచ్చెల్సీలో 1200 నుంచి 1700 క్యూసెక్కులకు చేరింది. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ (జీబీసీ)కు అధికారులు తుంగభద్ర నీటిని శనివారం నిలిపివేశారు. కల్వర్టు వద్ద ఇరుక్కున్న ఆర్టీసీ బస్సు ఉరవకొండ, న్యూస్‌లైన్ : నింబగల్లు - రేణువూకుపల్లి వుధ్య హంద్రీనీవా పిల్ల కాలువ వద్ద నిర్మిస్తున్న కల్వర్టు వద్ద వున్న పెద్ద గుంతల్లో రాయుదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ 11జడ్ 5684) ఇరుక్కు పోరుుంది. దీంతో గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోరుుంది. కొంతవుంది ప్రయూణికులు, గ్రావుస్తులు బస్సును తాళ్లతో బయుటకు లాక్కొచ్చారు. దెబ్బ తిన్న పత్తి అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: జిల్లాలో ఐదు రోజులుగా కురుస్తున్న వర్షా ల వల్ల పత్తి పంట దెబ్బతినే పరిస్థితి నెలకొంది. పెద్దవడుగూరు, గుత్తి, పామిడి, బొమ్మనహాల్, కణేకల్లు తదితర మండలాల్లో 20 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి పంట సాగైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు నిలిచింది. తేమ ఆరకపోవడంతో వివిధ రోగాలు, కలుపు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్ పేర్కొన్నారు. -
కన్నీటి వాన
పాలమూరు, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రైతన్నకు కన్నీళ్లను మిగిల్చాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలు పంటలను ముంచెత్తడంతో అన్నదాత అవస్థలు ఎదుర్కొంటున్నాడు. పలు ప్రాంతాల్లో ఇళ్లు దెబ్బతిని జనం నిరాశ్రయులయ్యారు. జిల్లావ్యాప్తంగా రూ. 750 కోట్ల మేర నష్టం వాటి ల్లినట్లు అంచనా. షాద్‌నగర్ పరిధిలోని సోలీపూర్‌లో ఇంటి గోడకూలి సింగపాగ చెన్నయ్య (60) అనే వృద్ధుడు మృతి చెందాడు. అమ్రాబాద్ మండల పరిధిలోని లక్ష్మపూర్(బీకే)కి చెందిన మూడావత్ లక్ష్మణ్(55)అనే వ్యక్తి వర్షానికి తడిసి మృతి చెందాడు. నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి డివిజన్ల పరిధిలోని దాదాపు 2.8 లక్షల ఎకరాల్లో పంటలు నీటి పాలయ్యాయి. పత్తి, మొక్కజొన్న, వరి, జొన్న, ఆముదం పంటలకు రూ. 550 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా. జిల్లా వ్యాప్తంగా 2200 వరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినగా, చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి, 30 వరకు పశువులు మృతి చెందాయి, ఈ కారణంగా మరో రూ. 200 కోట్ల మేర నష్టం కలిగినట్లు సమాచారం. పెద్దవాగులో వ్యక్తి గల్లంతు అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి సమీపంలో ప్రవహిస్తున్న పెద్దవాగులో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. రోడ్డుపై ఉధృతంగా పారుతున్న పెద్దవాగును తాడు సహాయంతో ముగ్గురు వ్యక్తులు దాటుతుండగా, తాడు తెగిపోవడంతో వారు వాగులో కొట్టుకుపోతుండగా స్థానికులు ఇద్దరిని వెంటనే రక్షించగలిగారు. వాగు మధ్యలో ఉన్న వెంకటయ్య వరద ఉధృతికి కొట్టుకుపోయి, గల్లంతయ్యాడు. -
వర్షార్పణం
ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. వేలాది ఎకరాల్లోని పంటలను దెబ్బ తీశాయి. అన్నదాతకు తీరని నష్టం మిగిల్చాయి. చేతికంది వచ్చిన పంట వర్షార్పణం అయింది. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు చెరువులకు గండ్లు పడ్డాయి. పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా నీరు చేరింది. కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా ఐదు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతను అతలాకుతలం చేస్తున్నాయి. 36 మండలాల్లో పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. 19530 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు, 100 ఎకరాల్లోఉద్యాన పంటలకు నష్టం సంభవించింది. రాజుపాలెం, దువ్వూరు, మైదుకూరు, సింహాద్రిపురం, చక్రాయపేట, ఖాజీపేట, ఎర్రగుంట్ల, పెండ్లిమర్రి, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, చెన్నూరు, సీకేదిన్నె,నందలూరు, పెద్దముడియం, కమలాపురం, వల్లూరు, వీఎన్‌పల్లె, కలసపాడు, బద్వేలు, లింగాల, ముద్దనూరు, చాపాడు, తొండూరు, వేంపల్లి, రామాపురం, గాలివీడు, బ్రహ్మంగారిమఠం, చిన్నమండెం, ఒంటిమిట్ట, రాజంపేట, కడప, కాశీనాయన, సుండుపల్లె, సంబేపల్లె, కొండాపురం, వేముల, రాజంపేట మండలాల్లో పంటలకు భారీ నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక నివేదికలు తయారు చేశారు. అన్నదాతలకు తీరని నష్టం : 4150 ఎకరాల్లో వరి, 12,845 ఎకరాల్లో పత్తి, 615 ఎకరాల్లో జొన్న, 130 ఎకరాల్లో మొక్కజొన్న, 1452.5 ఎకరాల్లో వేరుశనగ, 137.5 ఎకరాల్లో సజ్జ, 50 ఎకరాల్లో కొర్ర, 32.5 ఎకరాల్లో పెసర, 5 ఎకరాల్లో పసుపు, 100 ఎకరాల్లో టమోటా పంటలు దెబ్బతిన్నాయి. అనధికారికంగా జమ్మలమడుగులో 50వేల ఎకరాలు, రాజుపాలెంలో 2,500 ఎకరాలు, వేంపల్లెలో 1000, కలసపాడులో 4వేల ఎకరాల్లో మొక్కజొన్న, బద్వేలు మండలంలో సగిలేరు రక్షణ గోడ దెబ్బతినడంతో 1000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పొంగి ప్రవహిస్తున్న నదులు : భారీ వర్షాల కారణంగా జిల్లాలోని నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెన్నా నదిలో 37వేల క్యూసెక్కులు, కుందూ నదిలో 18వేల క్యూసెక్కులు, సగిలేరులో 10వేల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. ఎగువ ప్రాంతాల్లో మరిన్ని వర్షాలు కురిస్తే ఈ ప్రవాహాలు మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఐదు చెరువులకు గండ్లు : బద్వేలు మండలంలోని కమలకూరు చెరువు, పోరుమామిళ్ళ మండలంలోని అక్కల్‌రెడ్డిపల్లె చెరువు, తిమ్మారెడ్డిపల్లె చెరువు, కలసపాడు మండలంలోని ముసల్‌రెడ్డిపల్లె చెరువు, కాశినాయన మండలంలోని చెన్నవరం చెరువులకు గండ్లు పడ్డాయి. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షక ఇంజనీరు రమేష్ తన బృందంతో కలిసి గండ్లు పడ్డ చెరువులను పరిశీలించారు. గండ్లు పూడ్చేందుకు అవసరమైన చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు. పాపాఘ్నిలో ఇద్దరు గల్లంతు : వేంపల్లె మండలం అలిరెడ్డిపల్లె రహదారి సమీపంలో పాపాఘ్ని నదిలో ఈదుతూ గోతిలో పడి ఇద్దరు యువకులు గల్లంతు కాగా, మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డారు. వేంపల్లె సమీపంలోని సంచుల ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న వైఎస్ నగర్‌కు చెందిన పోలేపల్లె నవీన్, కోనేటి నరహరి (సెకండ్ ఇంటర్ ఎంపీసీ), పసుపులేటి మహేష్ అనే ముగ్గురు యువకులు నదిలోకి ఈతకు వెళ్లారు. ఇందులో పసుపులేటి మహేష్ సురక్షితంగా బయటపడ్డాడు. మిగిలిన యువకుల ఆచూకీ కోసం పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. జనరేటర్సహాయంతో రాత్రి కూడా గాలింపు చేపడతామని, హైదరాబాద్ నుంచి గజ ఈతగాళ్ళను కూడా పిలిపిస్తామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో వైఎస్ నగర్ శోకసముద్రంలో మునిగింది. వర్షపాతం : జిల్లాలోని 36 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 5.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. కొండాపురంలో అత్యధికంగా 18.2మి.మీ నమోదైంది. కడప 16.2మి.మీ, వల్లూరు 9.0, పెండ్లిమర్రి 3.4, సీకేదిన్నె 12.2, చెన్నూరు 17.6, ఖాజీపేట 2.0, కమలాపురం 6.0, ఎర్రగుంట్ల 14.0, వీఎన్‌పల్లె 9.6, చక్రాయపేట 8.4, రామాపురం 3.0, గాలివీడు 3.0, పెనగలూరు 3.2, కోడూరు 1.4, చిట్వేలి 10.2, బి.కోడూరు 15.4, బద్వేలు 2.4, గోపవరం 0.4, కాశినాయన 1.0, బ్రహ్మంగారిమఠం 12.4, సిద్దవటం 7.0, అట్లూరు 1.0, జమ్మలమడుగు 12.0. మైలవరం 15.4, పెద్దముడియం 5.2, ముద్దనూరు 5.9, ప్రొద్దుటూరు 2.0, చాపాడు 17.6, దువ్వూరు 11.8, మైదుకూరు 8.4, రాజుపాలెం 12.2, లింగాల 1.2, వేంపల్లె 8.6, వేముల 9.0, తొండూరులో 4.2మి.మీ. వర్షపాతం నమోదైంది. -
కొంప ముంచింది
అనంతపురం అగ్రికల్చర్/ఉరవకొండ, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి జిల్లాలో వేరుశనగ రైతులకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. మూడు రోజులుగా కురిసిన వానతో సుమారు 7 వేల ఎకరాల్లో వేరుశనగ కట్టె కుళ్లిపోయి, పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. కాయలు కూడా నల్లబారి పోవడంతో అవుటన్, ధరలు పడిపోతాయని చెబుతున్నారు. గురువారం కూడా గుత్తి మండలంలో 65.8 మి.మీ, వజ్రకరూరులో 64 మి.మీ వర్షం పడింది. కదిరిలో 46.6 మి.మీ, ఉరవకొండలో 40 మి.మీ, మడకశిరలో 31.4 మి.మీ, తలుపులలో 30.4 మి.మీ, అమడగూరులో 28.4 మి.మీ, ముదిగుబ్బలో 27.6 మి.మీ, బెళుగుప్పలో 27 మి.మీ, నల్లచెరువులో 23.2 మి.మీ, గుంతకల్లులో 23 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర, గుత్తి, ఉరవకొండ, కదిరి పెనుకొండ వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో వేరుశనగ పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ఉరవకొండ నియోజకవర్గంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం విడపనకల్లు వుండలంలో డొనేకల్లు జాతీయు రహదారి వద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయూరుు. ఉరవకొండ వుండలం రాయుంపల్లి, నెరిమెట్ల గ్రావూల్లోని దాదాపు 100 ఎకరాల్లో వరి పూర్తిగా నీట వుునిగింది. ఎకరాకు 15 వేల రూపాయులు పెట్టుబడి పెట్టి, కంటికి రెప్పలా చూసుకున్న పంట నీటవుునగడంతో బాధిత రైతులు నాగలక్ష్మి, వెంకటేష్, నారాయుణ, గోవిందప్ప, భాస్కర్ నాయుుడు లబోదిబోవుంటున్నారు. విడపనకల్లు, వజ్రకరూరు వుండలాల్లో దాదాపు 100 ఎకరాల్లో వేరుశనగ నీటవుునిగింది. కొన్ని చోట్ల చేలల్లో వామిగా వేయని పంట వర్షం నీటిలో కొట్టుకుపోయింది. ఉధృతంగా ప్రవహిస్తున్న రాయుంపల్లి చెరువులో ప్రయూణికులతో వెళుతున్న వుూడు ఆటోలు చిక్కుకున్నారుు. కొంతవుంది ఈతగాళ్లు వచ్చి ప్రయూణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వరద ఉధృతికి లత్తవరం చెరువులో భారీగా నీరు చేరి ఉధృతంగా ప్రవిహ స్తోంది. భారీ వర్షాల కారణంగా రాయుంపల్లి-నెరిమెట్ల రహదారి కోతకు గురైంది. కుండపోత వర్షం కారణంగా లత్తవరం సమీపంలో వున్న హంద్రీనీవా కాలువ కోతకు గురైంది. దీంతో వరద నీరు కాలువలోకి భారీగా చేరుతోంది. భారీ వర్షాలకు వజ్రకరూరులో 80, ఉరవకొండలో 30, విడపనకల్లులో 30 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఉరవకొండలోని డ్రైవర్స్ కాలనీ, చౌడేశ్వరీ, చెంగలవీధిలోని పలు చేనేత వుగ్గాల్లో వర్షపు నీరు చేరడంతో చేనేత వుుడి సరుకులు దెబ్బతిన్నారుు. 30 వరకు చేనేత వుగ్గాలు పనికి రాకుండా పోరుునట్లు కార్మికులు చెబుతున్నారు. -
కష్టం.. నష్టం..
కుండపోతగా కురుస్తున్న వర్షాలు రైతులకు గుండెకోత మిగుల్చుతున్నాయి. కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయి. చేతికందాల్సిన పంటలు చేలోనే నేలవాలుతున్నాయి. మొలకెత్తకుండానే బుడ్డశనగ కుళ్లిపోతోంది. అరటి,టమోటా పంటలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతో చేనేత కార్మికులు దిక్కుతోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. ఇళ్లల్లోకి నీరు రావడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. సాక్షి, కడప : జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు రైతన్నను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈశాన్య రుతు పవనాలు చురుగ్గా కదలడం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో 24 గంటలపాటు జిల్లాలో వర్షాలు కరిసే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పెన్నా, కుందూ, సగిలేరు నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. వంకలు, వాగులు, పొంగి ప్రవహిస్తున్నాయి. పోరుమామిళ్ల డివిజన్లోని చెరువులు పూర్తిగా నిండాయి. బుడ్డశనగ రైతులకు వర్షాలు తీరని నష్టాన్ని కలిగించాయి. పంట చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, వేరుశనగ పంటలపై వర్షం తీవ్ర ప్రభావాన్ని చూపింది. 19,680 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. 69 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, 152 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పరవళ్లు తొక్కుతున్న నదులు పెన్నానది 36,500 క్యూసెక్కుల నీటి పరిమాణంతో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆదినిమ్మాయపల్లె వద్ద నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రెండు గేదెలు కొట్టుకుని పోయాయి. సగిలేరుకు భారీగా వరదనీరు చేరుతుండటంతో లోయర్ సగిలేరు ప్రాజెక్టు నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు, బి.కోడూరు మండలాల్లోని అన్ని చెరువులు దాదాపు పూర్తిగా నిండాయి. కాశినాయన మండలం చెన్నవరం, కలసపాడు మండలం దూలంవారిపల్లె చెరువులకు గండ్లు పడ్డాయి. ఇరిగేషన్ ఎస్ఈ రమేష్ చెరువులను పరిశీలించి గండ్లు పూడ్చే యత్నం చేస్తున్నారు. కోలుకోలేని దెబ్బ నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో 50 వేల ఎకరాలు, రాజుపాళెం మండలంలో 2500, వేంపల్లెలో 1000 ఎకరాల్లో బుడ్డశనగ పంట మొలక దశలోనే పూర్తిగా కుళ్లిపోయింది. దీంతో రూ. 10 కోట్లకు పైగానష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సగిలేరు రక్షణ గోడలకు నాలుగు చోట్ల గండ్లు పడడంతో రాజుపాలెం, అప్పరాజుపేట, ఎర్రబల్లె ప్రాంతాల్లో వెయ్యి ఎకరాల్లో చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి పంటలు నీట మనిగాయి. దీంతో రూ. 5 కోట్ల నష్టం వాటిల్లింది. కలసపాడు మండలంలో నాలుగు వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతినగా రూ. 2.5 కోట్ల నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. కేవలం 19,680 హెక్టార్లలో మాత్రమే పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. ఉద్యాన పంటలకు తెగుళ్లు ఈ వర్షాలతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉల్లి, టమోటా పంటలు నీట మునగడంతో తెగుళ్లు ఆశిస్తున్నాయి. అరటికి సిగటోకా, పూల తోటలకు ఆకుమచ్చ తెగులు ఆశిస్తున్నాయి. -
సోమశిలకు భారీగా వరద
సోమశిల, న్యూస్‌లైన్ : బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు వల్ల జలాశయానికి భారీ గా వరద ప్రవాహం రానుంది. బుధవా రం ఉదయం జలాశయానికి 17 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుం డగా సాయంత్రానికి 30 వేలకు పెరి గినట్లు సమాచారం. జలాశయంలో నీటి నిల్వ ప్రస్తుతం 53 టీఎంసీలకు చేరువలో ఉంది. జలాశయానికి ఈ దఫా కురుస్తు న్న వర్షాలు మరింత ఊతమిస్తున్నాయి. పెన్నానది పైతట్టు ప్రాంతాలైన నంద్యా ల సమీపంలోని రాజోలుబండ వద్ద 5 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది. వైఎస్సార్ జిల్లా పైతట్టుప్రాంతాల్లో కురిసిన వర్షాలతో కుందూ, పాపాగ్ని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పెన్నానది ప్రధాన హెడ్ రెగ్యులేటర్ అయిన ఆదినిమ్మాయపల్లి వద్ద ఉదయం 20,380 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుండగా మధ్యాహ్నానికి 23,600 క్యూసెక్కులకు పెరిగింది. సాయంత్రానికి 32,500 క్యూసెక్కుల వంతున వరద ఉధృతి నమోదైంది. ఈ వరద మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. చెన్నూరు గేజి వద్ద ఉదయం 20 వేల క్యూసెక్కుల వరద నమోదైంది. మధ్యాహ్నం 26 వేలకు పెరిగింది. గరిష్టంగా సాయంత్రానికి 30 వేల క్యూసెక్కుల వంతున వరద ప్రవహిస్తోంది. ఉధృతంగా సగిలేరు వైఎస్సార్ జిల్లా బీకోడూరు మండలంలోని సగిలేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. సగిలేరు ఉదయం 22 వేల క్యూసెక్కుల వంతున నీరు ప్రవహిస్తోంది. మధ్యాహ్నానికి సగిలేరుకు వరద ఉధృతి పెరగడంతో అవుట్‌ఫ్లోను పెంచి 24,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదలను సాయంత్రానికి 26 వేల క్యూసెక్కులను పెంచారు. 16 ఏళ్లలో ఇంత వరద ఉధృతంగా రావడం ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. కండలేరుకు నీటి విడుదల పెంపు సోమశిల జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తున్న నేపథ్యంలో కండలేరుకు నీటి విడుదలను పెంచారు. ఉదయం 6 వేల క్యూసెక్కుల వంతున వరద కాలువ ద్వారా విడుదల చేశారు. జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో కండలేరుకు నీటి విడుదలను పెంచి 10 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. జలాశయానికి వస్తున్న వరద మరికొద్ది రోజులు ఇలాగే కొనసాగితే పూర్తి నీటి నిల్వ 72 టీఎంసీలకు చేరుకోనుంది. -
ముంచిన ముసురు
న్యూస్‌లైన్ బృందం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పాలమూరును ముసురు వర్షం ముం చెత్తింది. మూలిగేనక్కపై తాటికాయపడ్డ చందం గా ఇప్పటికే అప్పులబాధతో కొట్టుమిట్టాడుతు న్న అన్నదాతను వరుణుడు దెబ్బతీశాడు. గత రెండురోజులుగా కరుస్తున్న వర్షాలకు వరిపైరు నేలకొరిగింది. చేతికొచ్చిన మొక్కజొన్న మార్కెట్‌యార్డుల్లో తడిసిముద్దయింది. ఇప్పటికే తెల్లబంగారం నల్లబారి అన్నదాతకు ఆవేదన మిగి ల్చింది. ఆముదం పంటకు తెగుళ్లు సోకడంతో చేతికి రాకుండాపోయింది. జిల్లాలోని జడ్చర్ల, నవాబ్‌పేట, వనపర్తి, మహబూబ్‌నగర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట తదితర వ్యవసాయ మార్కెట్లలో వేలకొద్దీ బస్తాల మొక్కజొన్న వర్షార్పణమైంది. దేవరకద్ర మండలంలో 9వేల ఎకరాల్లో ఆముదం పంటకు నష్టం వాటిల్లినట్లు సమాచారం. జడ్చర్ల మార్కెట్లో విక్రయానికి తెచ్చిన ఆరువందల బస్తాల మొక్కజొ న్న తడిసిపోయింది. బుధవారం విక్రయాలు జ రగకపోవడంతో సరుకును అక్కడే ఉంచిన రైతు లు వర్షానికి తడిసిపోవడంతో లబోదిబోమంటున్నారు. తేమ సాకుతో వ్యాపారులు కొనుగో ళ్లు జరపకపోవడంతో రైతులు అచ్చంపేట మా ర్కెట్‌యార్డు ఆవరణలో ఎండబెట్టుకున్న పంట తడిసిపోయింది. దీంతో మొక్కజొన్న రాసుల ను కవర్లతో కప్పి కాపాడుకునేందుకు రైతులు విశ్వప్రయత్నాలు చేశారు. నవాబ్‌పేట మర్కెట్ లో నాలుగువేల బస్తాల మొక్కజొన్న పనికిరాకుండా పోయింది. ధాన్యాన్ని మార్కెట్‌కు తీసుకువచ్చిన తరుణంలోనే కొనుగోలు చేసి ఉంటే ఎలాగోలా బ యటపడేవారమని, తాజాగా మార్కెట్లో ధర కోసం వేచి ఉంటే రెక్కలకష్టం నీటి పాల య్యిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తడిసి ధాన్యాన్ని కొనుగోలుచేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వనపర్తి మార్కెట్ యార్డులో సుమారు మూడువేల బ్యాగుల మొక్కజొన్న తడిసిముద్దయింది. వ్యాపారులు, హమాలీల మధ్య తలెత్తిన వివాదం కారణంగా గతవారం రోజులుగా మార్కెట్లో క్రయవిక్రయాలు జరగడం లేదు. మార్క్‌ఫెడ్ అధికారులు కూడా కొనుగోలు చేయడం లేదు. తీరా రైతుల కష్టం వర్షానికి కొట్టుకుపోయింది. నేలకొరిగిన వరిపైరు రెండురోజలుగా కురుస్తున్న ముసురువర్షానికి మిడ్జిల్ మండలంలో రెండొందల ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. తాడూరు మండలంలో పత్తిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. పెద్దమందడి మండలంలో దొడగుంటపల్లి, చిన్నమందడి, అల్వాల, మోజర్ల, తదితర గ్రామాల్లో సుమారు రెండొందల ఎకరాల్లో వరిపంట నేలకొరిగింది. గోపాలపేట మండలంలో సోనామసూరి పంట నేలకొరిగి నష్టంవాటిల్లింది. ముసురువర్షాలకు కోడేరు మండలంలోని ఆరు ఇళ్లు కూలిపోయాయి. తెగిన చంద్రవాగు వంతెన ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షానికి మండలంలోని చంద్రవాగు వద్ద వేసిన తాత్కాలిక వంతెన బుధవారం మరోసారి తెగిపోయింది. బొల్గట్‌పల్లి స్టేజీ సమీపంలో మహబూబ్‌నగర్- శ్రీశైలం ప్రధాన రహదారి వద్ద పూర్తిస్థాయి వంతెన నిర్మాణం పనులు జరుగుతుండడంతో కాంట్రాక్టర్ పక్కనే తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టాడు. గతంలో కూడా రెండుసార్లు ఈ వంతెన భారీ వర్షాలకు తెగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముసురు వర్షం కురుస్తుండటంతో చంద్రవాగు నుంచి వరదనీటి ఉధృతికి తట్టుకోలేక మూడోసారి వంతెన తెగిపోయింది. దీంతో మార్గం గుండా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శ్రీశైలం వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలను హాజీపూర్ మీదుగా దారి మళ్లించారు. తెగిపోయిన వంతెనను అచ్చంపేట తహసీల్దార్ జ్యోతి, ఎస్ఐ రామలింగారెడ్డిలు పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం కలుగకుండా త్వరలో రాకపోకల పునరుద్ధరిస్తామని ఆర్అండ్బీ డీఈ చంద్రశేఖర్ తెలిపారు. -
వానో వాన..
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన వాన మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. కొన్ని మండలాల్లో దట్టమైన మేఘాలు ఆవరించి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. మరికొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు గాండ్లపెంట మండలంలో అత్యధికంగా 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కదిరిలో 50.2 మి.మీ, తలుపుల 45, ముదిగుబ్బ 39.2, యల్లనూరు 35.4, మడకశిర 35, నల్లమాడ 31.8, కంబదూరు 27, ఎన్పీకుంట 25.4, తాడిమర్రి 24.2, నల్లచెరువు 23.6, పుట్లూరు 23, ఆత్మకూరు 20.2, తాడిపత్రిలో 20 మి.మీ మేర వర్షం పడింది. తక్కిన అన్ని మండలాల్లోనూ ఓ మోస్తరుగా వర్షపాతం నమోదైంది. జిల్లా అంతటా 811 మి.మీ వర్షం కురవడంతో 12.9 మి.మీ సగటు నమోదైంది. అక్టోబర్‌లో జిల్లా సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా... ప్రస్తుతానికి 37.8 మి.మీ కురిసింది. జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 416.9 మి.మీ వర్షం పడాల్సివుండగా ఏడు శాతం తక్కువగా 388.2 మి.మీ నమోదైంది. కాగా... రానున్న రెండు రోజులూ వర్షం పడే సూచనలున్నాయని రేకులకుంటలోని వాతావరణ, వ్యవసాయ విభాగం శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ ఎస్.మల్లీశ్వరి, సాంకేతిక అధికారి పి.వెంకటరావు మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో 21 నుంచి 48 మి.మీ మేర వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించారు. అల్పపీడన ద్రోణి ప్రభావం తగ్గే వరకు వేరుశనగ పంట తొలగించుకోవద్దని రైతులకు సూచించారు. వర్షం ఎక్కువైతే పంటలకు నష్టం జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు చేటుతెచ్చేలా ఉన్నాయి. వీటివల్ల ఖరీఫ్, రబీ పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. జూన్‌లో జిల్లావ్యాప్తంగా 40 వేల హెక్టార్లలో సాగైన వేరుశనగ పంటను చాలా చోట్ల తొలగించారు. అయితే... వేరుశనగ కట్టె పొలాల్లోనే ఉండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగైదు రోజులు వర్షం కొనసాగితే పంట మొత్తం కుళ్లిపోయే ప్రమాదముంది. చెట్టుకు ఉన్న రెండు, మూడు కాయలు నల్లబారడమే కాకుండా పశుగ్రాసం కూడా పనికిరాకుండా పోతుంది. వాములు వేసిన ప్రాంతాల్లో కూడా లోపల బూజు వచ్చే అవకాశముంది. కళ్యాణదుర్గం, మడకశిర వ్యవసాయ సబ్ డివిజన్లతో పాటు రాప్తాడు, బుక్కపట్నం, పెనుకొండ, కనగానపల్లి, రామగిరి తదితర మండలాల్లో వేరుశనగ రైతులు నష్టపోయే పరిస్థితి కన్పిస్తోంది. రబీలో 50 వేల హెక్టార్లకు పైగా సాగైన పప్పుశనగ పంట కూడా దెబ్బతినే అవకాశముంది. పొలాల్లో నీళ్లు నిలబడితే లేత పప్పుశనగ పైరు కుళ్లిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలు ఆముదం పంటను సైతం దెబ్బతీసే పరిస్థితి ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల తర్వాత ఇటీవల కొంత కోలుకున్న ఆముదం పంట ఇప్పుడు పూత, గెల దశలో ఉంది. జడివాన వల్ల దిగుబడులు తగ్గే అవకాశముందని రైతులు చెబుతున్నారు. -
అతలాకుతలం
సాక్షి, కడప : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కురిసిన వర్షం జిల్లాలోని పలు ప్రాంతాలను కుదిపేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జిల్లా అతలాకుతలమైంది. వంకలు, వాగులు ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులకు గండ్లు పడ్డాయి. కొసినేనిపల్లె వంక ఉధృతంగా ప్రవహించడంతో ఎర్రగుంట్ల మండలం కలమల్ల కృష్ణానగర్ దళితవాడకు చెందిన రామసుబ్బమ్మ అనే మహిళ మృతి చెందింది.రామలక్షుమ్మ అనే మరో మహిళ గల్లతైంది. 50 ఇళ్లు పూర్తిగా నేలమట్టం కాగా, 150 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆర్టీపీపీలోని ఈఎస్పీ, కోల్‌ప్లాంట్, మెయిన్ ప్లాంట్‌లోకి నీరు చేరింది. మోటార్లు పూర్తిగా నీట మునిగాయి. మరో 10 రోజుల వరకు విద్యుత్ ఉత్పత్తిని పునరుద్దరించే అవకాశాలు లేవని అధికారులు పేర్కొంటున్నారు. ఐదు యూనిట్లలో 1050మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ముంపు గ్రామాల్లోకి శ్రీనివాసపురం రిజర్వాయర్ నీరు చేరింది. సుండుపల్లె,చిన్నమండెం, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లోని పలు చెరువులు పూర్తిగా నిండగా,కొన్నింటికి గండ్లు పడ్డాయి. జిల్లాలో అత్యధికంగాప్రొద్దుటూరు పట్టణంలో 215.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యానాది కాలనీ పూర్తిగా నీట మునిగింది. ముద్దనూరులోని కొసినేనిపల్లె వంకలో ఆరుగురు రజకులు చిక్కుకున్నారు. వీరిని పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆర్డీఓ రఘునాథరెడ్డి సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ముద్దనూరు దళితవాడ జలమయమైంది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ముద్దనూరు చుట్టుపక్కల ఉన్న పుల్లేరు వంక, కొసినేనిపల్లె వంక, కాయవంక పారడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎర్రగుంట్ల మండలం కృష్ణానగర్ దళితవాడలోకి కొసినేనిపల్లె వంక, సిరిగేపల్లె చెరువు , ఆర్టీపీపీ కొండల నుంచి భారీగా నీరు రావడంతో ఇళ్లు కూలి రామసుబ్బమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె మరదలు రామలక్షుమ్మ గల్లంతైంది. భర్త రాముడు, చెల్లెలు, కుమార్తె స్థానికుల సహాయంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆర్టీపీపీలోని ఈఎస్పీ, కోల్‌ప్లాంట్, మెయిన్ప్లాంట్లోకి నీరు చేరి మోటార్లు పూర్తిగా నీట మునగడంతో పది రోజులపాటు విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు. పొట్లదుర్తి, కల్లమల,చిలంకూరు, మాలేపాడు వంకలు పొంగి ఉధృతంగా ప్రవహించాయి. ఆయా ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కోనశశిధర్, జాయింట్ కలెక్టర్ నిర్మల, ఆర్డీఓ వీరబ్రహ్మం పరిశీలించారు. మృతి చెందిన మహిళ, గల్లంతైన మహిళ కుటుంబ సభ్యులకు తాత్కాలిక సహాయం కింద రూ. 10వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అందజేశారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 2 వేలు చొప్పున సహాయాన్ని అందించారు. ప్రొద్దుటూరులో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీల కారణంగా రోడ్లపైనే మురికి నీరు పొంగి ప్రవహించింది. మున్సిపల్ కార్యాలయం, కోర్టు, త్రీ టౌన్ పోలీసుస్టేషన్, అగ్నిమాపక కేంద్రం నీటమునిగాయి. యానాదికాలనీ పూర్తిగా నీటిలో చిక్కుకుపోవడంతో భారీగా ఆస్తినష్టం జరిగింది. వైఎస్సార్సీపీనేత రాచమల్లు ప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కొర్రపాడు వద్ద నల్లవాగు, గోపవరం వద్ద కేసీ కెనాల్ ఉప్పవాగువంక భారీగా ప్రవహించడంతో ప్రొద్దుటూరుపట్టణానికి మధ్యాహ్నం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నాకు భారీగా నీరు చేరడంతో నది ప్రవహించింది. రాజుపాలెం, చాపాడులో భారీ వర్షం కురవడంతో వరి, పత్తి, పసుపు పంట నీట మునిగింది. రైతులకు తీవ్ర నష్టం సంభవించింది. కొండ ప్రాంతం నుంచి భారీగా వర్షపు నీరు చేరడంతో మైలవరం దక్షిణ కాలువ రెండుచోట్ల కొట్టుకుపోయింది. కన్యతీర్థంలో మనిషిలోతు నీరు ప్రవహించింది. అక్కడున్న 15 మంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. జమ్మలమడుగు-ముద్దనూరు మధ్య రాకపోకలు స్తంభించాయి. సంబేపల్లె మండలంలోని పది చిన్న కుంటలు తెగిపోయాయి. దేవపట్ల చెరువు తెగిపోయింది. దాలం చెరువుకు పదిచోట్ల గండ్లుపడ్డాయి. తద్దికూలవంక ఉధృతంగా ప్రవహించడంతో రాయచోటి-రాజంపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు గ్రామాలైన పాతవటంపల్లె, కొత్తవటంపల్లె, బండకింద పురుగుపల్లెలోకి శ్రీనివాస రిజర్వాయర్ నీరు చేరడంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పులివెందుల మండలం బెస్తవారిపల్లె సమీపంలో పీబీసీ కాలువ కోసుకుపోయింది. వేముల మండలం కొండ్రెడ్డిపల్లె చెరువుకు గండి పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.మబ్బుచింతలపల్లె, ఆర్.తుమ్మలపల్లెలో కొండపై నుంచి వర్షపు నీరు భారీగా రావడంతో 80 ఎకరాల్లో అరటి పంట పూర్తిగా దెబ్బతింది.దాదాపు రూ. 2 కోట్ల మేర నష్టం సంభవించింది. బద్వేలులోని ఆర్టీసీ డిపోను వర్షం నీరు చుట్టుముట్టింది. డిపోలోని బస్సులు నీటిలో మునిగాయి. 40 మి.మీ.పైగా వర్షపాతం నమోదైన మండలాలు జిల్లాలో 40మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం 20 మండలాల్లో నమోదైంది. అందులో కమలాపురం, ఎర్రగుంట్ల, వీఎన్ పల్లె,చిన్నమండెం, సంబేపల్లె, బద్వేలు, గోపవరం, బి.మఠం, జమ్మలమడుగు, మైలవరం, ముద్దనూరు, ప్రొద్దుటూరు,చాపాడు, దువ్వూరు,రాజుపాలెం, దువ్వూరు, లింగాల, వేంపల్లె, వేముల, తొండూరు ఉన్నాయి. 20-40 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం ఎనిమిదిమండలాల్లో నమోదు కాగా, అందులో రాయచోటి, చక్రాయపేట, రామాపురం, గాలివీడు, పెద్దముడియం, కొండాపురం, మైదుకూరు, సింహాద్రిపురం ఉన్నాయి. అలాగే 20 మి.మీ.లోపు వర్షపాతం నమోదైన మండలాలు 15 ఉన్నాయి. అందులో వల్లూరు, కడప, పెండ్లిమర్రి, చెన్నూరు, ఖాజీపేట, వీరబల్లి, సుండుపల్లె, ఎల్ఆర్ పల్లె, గాలివీడు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, బి.కోడూరు, కలసపాడు, సిద్దవటం, అట్లూరు ఉన్నాయి. ఇదిలా ఉండగా రాజంపేట, నందలూరు, పెనగలూరు, చిట్వేలి, పోరుమామిళ్ల, కాశినాయన, ఒంటిమిట్ట మండలాల్లో వర్షం కురువలేదు. -
అతలాకుతలం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా శుక్రవారం రెండోరోజు కూడా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. జిల్లాలో సగటున 31.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. అంతా అతలాకుతలమైంది. గరిడేపల్లిలో అత్యధికంగా 85.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. తిర్మలగిరి, మిర్యాలగూడ మండలాల్లో 85 మిల్లీమీటర్లు, నేరేడుచర్లలో 80.2, దామరచర్లలో 79.6, త్రిపురారంలో 70 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పెన్‌పహాడ్‌లో 60.4, చిలుకూరులో 43.2, కోదాడలో 13.6, మేళ్లచెర్వులో 19.4, నాంపల్లిలో 34, చింతపల్లిలో 43, పీఏపల్లి 40, దేవరకొండలో 52, డిండి 23.6, చందంపేట 54.8, వేములపల్లి 50.2, నిడమనూర్ 28.2, హుజూర్నగర్ 40.2, మఠంపల్లి 25.4, హాలియా 32.4, పెద్దవూర 20.4, తుంగతుర్తి 33.2, నూతనకల్ 35.4, ఆత్మకూర్ (ఎస్) 32, అర్వ పల్లి 16.8, సూర్యాపేట 38, చివ్వెంల 44.2, మోతె 12.4, నడిగూడెం 26.2, మునగాల 29.2, గుర్రంపోడు, 15.2, మర్రిగూడ 34, కనగల్ 11.4, చండూరు 13.6, నారాయణపూర్ 4.4, మునుగోడు 15.2, నల్లగొండ 8.4, తిప్పర్తి 19.2, కేతేపల్లి 35, నకిరేకల్ 26.8, కట్టంగూరు 14.9, నార్కట్‌పల్లి 8.8, చిట్యాల 3.4, శాలిగౌరారం 25.2, రామన్నపేట 9.2, చౌటుప్పల్ 14.8, పోచంపల్లి 15.4, బీబీనగర్ 12.4, భువనగిరి 13, వలిగొండ 25.2, ఆత్మకూర్ (ఎం) 23.2, మోత్కూరు 45.8, గుండాలలో 43.8, ఆలేరు 8.2, యాదగిరిగుట్ట 10.6, రాజాపేట 8.4, తుర్కపల్లి 5.2, బి.రామారంలో 5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. - న్యూస్‌లైన్, నల్లగొండ అగ్రికల్చర్