బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి జిల్లాలో వేరుశనగ రైతులకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. మూడు రోజులుగా కురిసిన వానతో సుమారు 7 వేల ఎకరాల్లో వేరుశనగ కట్టె కుళ్లిపోయి, పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు.
అనంతపురం అగ్రికల్చర్/ఉరవకొండ, న్యూస్‌లైన్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి జిల్లాలో వేరుశనగ రైతులకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. మూడు రోజులుగా కురిసిన వానతో సుమారు 7 వేల ఎకరాల్లో వేరుశనగ కట్టె కుళ్లిపోయి, పశుగ్రాసానికి కూడా పనికిరాకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. కాయలు కూడా నల్లబారి పోవడంతో అవుటన్, ధరలు పడిపోతాయని చెబుతున్నారు. గురువారం కూడా గుత్తి మండలంలో 65.8 మి.మీ, వజ్రకరూరులో 64 మి.మీ వర్షం పడింది.
కదిరిలో 46.6 మి.మీ, ఉరవకొండలో 40 మి.మీ, మడకశిరలో 31.4 మి.మీ, తలుపులలో 30.4 మి.మీ, అమడగూరులో 28.4 మి.మీ, ముదిగుబ్బలో 27.6 మి.మీ, బెళుగుప్పలో 27 మి.మీ, నల్లచెరువులో 23.2 మి.మీ, గుంతకల్లులో 23 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కళ్యాణదుర్గం, ధర్మవరం, మడకశిర, గుత్తి, ఉరవకొండ, కదిరి పెనుకొండ వ్యవసాయ సబ్ డివిజన్ల పరిధిలో వేరుశనగ పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. ఉరవకొండ నియోజకవర్గంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
గురువారం విడపనకల్లు వుండలంలో డొనేకల్లు జాతీయు రహదారి వద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయూరుు. ఉరవకొండ వుండలం రాయుంపల్లి, నెరిమెట్ల గ్రావూల్లోని దాదాపు 100 ఎకరాల్లో వరి పూర్తిగా నీట వుునిగింది. ఎకరాకు 15 వేల రూపాయులు పెట్టుబడి పెట్టి, కంటికి రెప్పలా చూసుకున్న పంట నీటవుునగడంతో బాధిత రైతులు నాగలక్ష్మి, వెంకటేష్, నారాయుణ, గోవిందప్ప, భాస్కర్ నాయుుడు లబోదిబోవుంటున్నారు. విడపనకల్లు, వజ్రకరూరు వుండలాల్లో దాదాపు 100 ఎకరాల్లో వేరుశనగ నీటవుునిగింది. కొన్ని చోట్ల చేలల్లో వామిగా వేయని పంట వర్షం నీటిలో కొట్టుకుపోయింది. ఉధృతంగా ప్రవహిస్తున్న రాయుంపల్లి చెరువులో ప్రయూణికులతో వెళుతున్న వుూడు ఆటోలు చిక్కుకున్నారుు. కొంతవుంది ఈతగాళ్లు వచ్చి ప్రయూణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
వరద ఉధృతికి లత్తవరం చెరువులో భారీగా నీరు చేరి ఉధృతంగా ప్రవిహ స్తోంది. భారీ వర్షాల కారణంగా రాయుంపల్లి-నెరిమెట్ల రహదారి కోతకు గురైంది. కుండపోత వర్షం కారణంగా లత్తవరం సమీపంలో వున్న హంద్రీనీవా కాలువ కోతకు గురైంది. దీంతో వరద నీరు కాలువలోకి భారీగా చేరుతోంది. భారీ వర్షాలకు వజ్రకరూరులో 80, ఉరవకొండలో 30, విడపనకల్లులో 30 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఉరవకొండలోని డ్రైవర్స్ కాలనీ, చౌడేశ్వరీ, చెంగలవీధిలోని పలు చేనేత వుగ్గాల్లో వర్షపు నీరు చేరడంతో చేనేత వుుడి సరుకులు దెబ్బతిన్నారుు. 30 వరకు చేనేత వుగ్గాలు పనికి రాకుండా పోరుునట్లు కార్మికులు చెబుతున్నారు.