బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా శుక్రవారం రెండోరోజు కూడా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. జిల్లాలో సగటున 31.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. అంతా అతలాకుతలమైంది. గరిడేపల్లిలో
అత్యధికంగా 85.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. తిర్మలగిరి, మిర్యాలగూడ మండలాల్లో 85 మిల్లీమీటర్లు, నేరేడుచర్లలో 80.2, దామరచర్లలో 79.6, త్రిపురారంలో 70 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
పెన్‌పహాడ్‌లో 60.4, చిలుకూరులో 43.2, కోదాడలో 13.6, మేళ్లచెర్వులో 19.4,
నాంపల్లిలో 34, చింతపల్లిలో 43, పీఏపల్లి 40, దేవరకొండలో 52, డిండి 23.6, చందంపేట 54.8, వేములపల్లి 50.2, నిడమనూర్ 28.2, హుజూర్‌నగర్ 40.2, మఠంపల్లి 25.4, హాలియా 32.4, పెద్దవూర 20.4, తుంగతుర్తి 33.2, నూతనకల్ 35.4, ఆత్మకూర్ (ఎస్) 32, అర్వ
పల్లి 16.8, సూర్యాపేట 38, చివ్వెంల 44.2, మోతె 12.4, నడిగూడెం 26.2, మునగాల 29.2, గుర్రంపోడు, 15.2, మర్రిగూడ 34, కనగల్ 11.4, చండూరు 13.6, నారాయణపూర్ 4.4, మునుగోడు 15.2, నల్లగొండ 8.4, తిప్పర్తి 19.2, కేతేపల్లి 35, నకిరేకల్ 26.8, కట్టంగూరు
14.9, నార్కట్‌పల్లి 8.8, చిట్యాల 3.4, శాలిగౌరారం 25.2, రామన్నపేట 9.2, చౌటుప్పల్ 14.8, పోచంపల్లి 15.4, బీబీనగర్ 12.4, భువనగిరి 13, వలిగొండ 25.2, ఆత్మకూర్ (ఎం) 23.2, మోత్కూరు 45.8, గుండాలలో 43.8, ఆలేరు 8.2, యాదగిరిగుట్ట 10.6, రాజాపేట 8.4,
తుర్కపల్లి 5.2, బి.రామారంలో 5 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
- న్యూస్‌లైన్, నల్లగొండ అగ్రికల్చర్
అతలాకుతలం
Published Sat, Aug 17 2013 2:22 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement