ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డికి సొంత జిల్లాలో ఘోర పరాజయం ఎదురైంది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డికి సొంత జిల్లాలో ఘోర పరాజయం ఎదురైంది. నియోజకవర్గం మారినా ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన రఘువీరా ఈ సారి పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. అయినా ఫలితం దక్కలేదు. ఇక కళ్యాణదుర్గంతో పాటు రఘువీరా సొంత ఊరు మడకశిరలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులది ఇదే పరిస్థితి. అనంతపురం జిల్లాలో ఇతర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. చాలా చోట్లు డిపాజిట్లు గల్లంతయ్యాయి.