![రైలు ఢీకొని యువకుడు.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/81474311293_625x300.jpg.webp?itok=TJ6eYyQt)
రైలు ఢీకొని యువకుడు..
పెనుకొండ: పట్టణంలోని దర్గాపేటకు చెందిన ముఫాసిర్ (25) రైలు ఢీకొని ఆదివారం మృతి చెందాడు. కుటుంబసభ్యులు, బంధువుల కథనం మేరకు.. కొన్ని నెలలుగా ముఫాసిర్ మతి స్థిమితం సరిగా లేక ఎక్కడపడితే అక్కడ తిరుగుతూ ఉండేవాడు. ఆదివారం రాత్రి మార్కెట్‌యార్డ్ సమీపంలో రైలు ఢీకొని మృత్యువాతపడ్డాడు. సోమవారం ఉదయం సమాచారం అందుకున్న తల్లిదండ్రులు నసీమున్నీసా, హుజూర్ అహ్మద్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.